ePaper
Sunday, June 7, 2026
ePaper
Homeశివ సూర్య డైలీప్రేమ సమాజంలోని అంధుల పెళ్లికి డాక్టర్ కందుల సహకారం

ప్రేమ సమాజంలోని అంధుల పెళ్లికి డాక్టర్ కందుల సహకారం

📰 Generate e-Paper Clip

కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న సీపీ

విశాఖపట్నం జయ జయహే : మనసున్న మంచి మనిషిగా, అందరి బంధువుగా, ఆత్మీయుడుగా, ఆప్తుడుగా అందరి మన్ననలు అందుకుంటున్న విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు మరో మారు తన సహృదయాన్ని చాటుకున్నారు. ప్రేమ సమాజంలో అంధులైన శివ జ్యోతి, రాఘవేంద్ర లకు జరగబోయే పెళ్లికి పెద్దరికం చాటుకున్నారు. వీరిద్దరికి ప్రేమ సమాజంలో ఈ నెల 11న ఆదివారం వివాహం జరగనుంది. ఈ సందర్భంగా శనివారం డాక్టర్ కందుల నాగరాజు నళిని దేవి దంపతులు వధూవరులకు బంగారు తాళిబొట్టు, పట్టు వస్త్రాలు, వెండి మెట్టెలు, పసుపు కుంకుమ, స్వీట్లుతో పాటు మరికొన్ని చీరలు అందించారు.

ముఖ్య అతిథి విశాఖ నగర సి పి డాక్టర్ శంఖబ్రత బాగ్చీ చేతుల మీదుగా వీటిని అందజేశారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ డాక్టర్ కందుల నాగరాజు సహృదయాన్ని కొనియాడారు. మంచి పనులకు ఆయన ఎప్పుడూ ముందు ఉంటారని ప్రశంసించారు. ప్రేమ సమాజం కార్యవర్గం ఒక మంచి నిర్ణయం తీసుకొని వీరిద్దరికీ వివాహం చేయడం శుభపరిణామం అని అభినందించారు. అనంతరం డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ ప్రేమ సమాజం ఎన్నో సేవా కార్యక్రమాలకు చిరునామాగా నిలిచిందని కొనియాడారు. ఎంతో మందిని అక్కున చేర్చుకొని వారి జీవితాలలో వెలుగును నింపిందని ప్రశంసించారు. నేడు మంచి మనసున్న ఇద్దరికీ వివాహం చేసేందుకు నిర్ణయం తీసుకోవడం అభినందించదగ్గ విషయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాను కూడా భాగస్వామిని అవ్వడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న సీపీకి కృతజ్ఞతలు తెలిపారు. ప్రేమ సమాజం చేపట్టే ఎటువంటి కార్యక్రమానికైనా తన పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని వెల్లడించారు.. ఈ కార్యక్రమంలో ప్రేమ సమాజం అధ్యక్షులు బుద్ధ శివాజీ, కార్యదర్శి హరి మోహనరావు, కార్యవర్గ సభ్యులు ప్రేమ గణపతి రావు, అప్పలరాజు, ఎం.వి.కె.గుప్తా, అలాగే ఎం.శాలివాహన,కె.కృష్ణ, కె.రాజశేఖర్, డాక్టర్.సురేష్,టి.అర్జున, సిపిఐ బుజ్జి, అప్పారావు, ఆధిబాబు, ఇందిరా,ప్రియాంక, కె.రూప,జానకి, శ్రీదేవి, శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

                                 

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!