Saturday, April 11, 2026
Homeశివ సూర్య డైలీసిట్ సోదాలు

సిట్ సోదాలు

హైదరాబాద్ లో తనిఖీలు

లిక్కర్ స్కామ్ లో దూకుడు

జయజయహే : మద్యం స్కాం కేసు దర్యాప్తులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. మద్యం కేసులో నిందితుల ఇళ్లపై సిట్ అధికారులు శుక్రవారం హైదరాబాద్‌లో ఒకేసారి సోదాలు చేశారు. లిక్కర్ స్కామ్‌లో హైదరాబాద్‌లో నాలుగు చోట్ల సోదాలు జరిపారు. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మాజీ కార్యదర్శి ధనుంజయ్ రెడ్డి, మాజీ పీఏ కృష్ణమోహన్ రెడ్డి, ఆయన కుమారుడు రోహిత్ రెడ్డి, భారతి సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప ఇళ్లు, కార్యాలయాలపై సిట్ అధికారులు సోదాలు చేశారు. బంజారాహిల్స్‌లోని రోడ్ నెంబర్ 12లో కల్వ ధనుంజయ రెడ్డి ఇంట్లో ఏపీ పోలీసులు సోదాలు చేశారు. లిక్కర్ పాలసీలో ధనుంజయ రెడ్డి పాత్ర కీలకంగా ఉందని గుర్తించారు. బాలాజీ గోవిందప్ప అందుబాటులో లేకపోవడంతో ఆయన సతీమణికి సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో సిట్ అధికారులు పేర్కొన్నారు. అలాగే కృష్ణమోహన్ రెడ్డి కూడా ఇంట్లో లేకపోవడంతో ఆయన కుమారుడు రోహిత్ రెడ్డికి సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. నోటీసులు జారీ చేసి వారి ఇళ్లల్లో సిట్ ప్రత్యేక అధికారులు సోదాలు ప్రారంభించారు. ఒకేసారి హైదరాబాద్‌లో ముగ్గురు కీలక నిందితుల ఇళ్లపై సిట్ అధికారులు సోదాలు జరిపారు. మే 11వ తేదీ తమ ఎదుట విచారణకు హాజరు కావాలంటూ సిట్ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. . లిక్కర్ స్కాంలో కృష్ణమోహన్ రెడ్డి కీలకంగా ఉన్నారు. విచారణకు హాజరుకాకుండా కృష్ణమోహన్ రెడ్డి తప్పించుకు తిరుగుతున్నారని అధికారులు తెలిపారు. ముందస్తు బెయిల్ కోసం కృష్ణమోహన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా కృష్ణమోహన్ రెడ్డి సుప్రీంకోర్టులో వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ డిస్మిస్ అయింది. కాగా.. ఏపీ లిక్కర్ స్కామ్‌లో కుట్ర దాగి ఉందని ఇప్పటికే విచారణలో సీఐడీ అధికారులు తేల్చారు. ముడుపుల రూపంలో రూ. 3200 కోట్లు చేతులు మారినట్లు సీఐడీ అధికారులు గుర్తించారు. ఈ కేసులో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్పలు కీలకంగా ఉన్నట్లు సీఐడీ అధికారులు ఇప్పటికే విచారణలో తేల్చారు. భారతి సిమెంట్ డైరెక్టర్ ఉన్న గోవిందప్ప లిక్కర్ విధానంలో ముడుపులు తీసుకున్నట్లు గుర్తించారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే వీరు అనుకున్నట్లుగా లిక్కర్ పాలసీని తీసుకువచ్చారని గుర్తించారు. ధనుంజయ్ రెడ్డి ఇంట్లో ఏపీ సీఐడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇప్పటికే కీలక పత్రాలను సీఐడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. లిక్కర్ సరఫరా చేసే వారి దగ్గర నుంచి ముడుపులు తీసుకున్నట్లు గుర్తించారు. ముడుపుల ద్వారా వచ్చిన సొమ్మును డొల్ల కంపెనీలకు బదిలీ చేసినట్లు అధికారులు తేల్చారు. పర్సంటేజ్‌లపై చర్చించేందుకు హైదరాబాద్ ,తాడేపల్లిలో మద్యం యజమానులతో చర్చించినట్లు సీఐడీ అధికారులు విచారణలో తేల్చారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?