Saturday, April 11, 2026
Homeశివ సూర్య డైలీపాక్ దాడులను తిప్పికొట్టాం

పాక్ దాడులను తిప్పికొట్టాం

పౌరులను టార్గెట్ చేయలేదు

ఉగ్రవాదులనే లక్ష్యంగా చేసుకున్నాం

ఎల్ ఓసీలో 16 మంది మరణించారు

వింగ్ కమాండర్ సోఫియా ఖురేషీ స్పష్టీకరణ

ఐక్యరాజ్యసమితికి వివరాలు నివేదన

జయజయహే : పాకిస్తాన్ పౌరులను భారత్ టార్గెట్ గా చేసుకోలేదని భారత ఫారిన్ సెక్రటరీ విక్రమ్ మిస్త్రి ప్రకటించారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతల అంశంపై వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కల్నర్ సోఫియా ఖురేషితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. పౌరులను లక్ష్యంగా చేసుకోలేదు, ఉగ్రవాదులను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నామని కల్నల్ సోఫియా ఖురేషి స్పష్టం చేశారు. పాకిస్తాన్ భారత సైనిక స్థావరాలపై దాడి చేయడానికి ప్రయత్నించింది.. ఆ ప్రయత్నాలను రక్షణ దళాలు తిప్పికొట్టాయని వింగ్ కమాండ్ వ్యోమికా సంగ్ తెలిపారు. నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ కాల్పుల్లో 16 మంది అమాయకులు మరణించారన్నారు. భారతదేశం తీవ్రవాదాన్ని ఆపడానికి కట్టుబడి ఉందని … దానికి పాకిస్తాన్ అంగీకరించాల్సి లఉందన్నారు. ఇప్పటికీ పాకిస్తాన్ భారీ ఫిరంగులను ఉపయోగించి ఎల్ ఓ సీ పై కాల్పులను తీవ్రతరం చేసిందని కల్నల్ సోఫియా ఖురేషి అన్నారు. అంతర్జాతీయ సమాజాన్ని పాకిస్తాన్ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని కల్నల్ సోఫియా ఆరోపించారు. ఉగ్రవాద శిబిరాలను పాకిస్తాన్ సైన్యమే పోషిస్తోందన్నారు. లాడెన్ ఎక్కడున్నాడని.. మసూద్ అజర్ ఎక్కుడున్నారని కల్నర్ సోఫియా ప్రశ్నించారు. పాకిస్తాన్ లో ఏం జరుగుతుందో ప్రపంచం అంతా తెలుసన్నారు. పాకిస్తాన్ తప్పుడు సమాచరాన్ని వ్యాప్తి చేస్తోందన్నారు. పహల్గాం దాడితో మొదటగా ఉద్రిక్తతలు పెంచింది పాకిస్తానేనని ఫారిన్ సెక్రటరి విక్రమ్ మిస్త్రి ప్రకటించారు. పాకిస్తాన్ చేసిన దాడికి సంబందించిన ఆధారాలు ఉన్నాయన్నారు. వాటి డ్రోన్లు, మిస్సైళ్ల శకలాలు సేకరించామని ఆధారాలుగా.. ఐక్యరాజ్య సమితికి అందిస్తామన్నారు. చనిపోయిన ఉగ్రవాదులకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు చేశారని విక్రమ్ మిస్త్రి ఫోటోలు చూపించారు. ప్రార్థనా స్థలాలను ఉగ్రవాద కేంద్రాలుగా మార్చారని.. మండిపడ్డారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ లో ఉగ్రవాదులపై దాడి చేశాం తప్ప . ఎలాంటి ప్రాజెక్టులు,మౌలిక సదుపాయాలపై దాడులు చేయలేదని స్పష్టం చేశారు. లాహోర్ లో ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను నాశనం చేశామని స్పష్టం చేశారు. ప్రపంచంలో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు పాకిస్తాన్ లో ఉన్నారని విక్రమ్ మిస్త్రి గుర్తు చేశారు. జమ్మూకశ్మీర్ లో సిక్కులను పాక్ టార్గెట్ చేసిందన్నారు. మూడు గురుద్వారాలపై దాడి చేసిందన్నారు.పాకిస్తాన్ లోని సరిహద్దు దాడుల్లో పదహారు మంది పౌరులు చనిపోయారుని ఫోటోలను చూపించారు విక్రమ్. పహల్గాం దాడి ఘటనలపై అంతర్జాతీయ దర్యాప్తునకు పాక్ మొగ్గుచూపుతోందన్నారు. ఆధారాలు ఇవ్వాలని అడుగుతోందని గతంలో ఎన్నో దాడులపై ఆధారాలు ఇచ్చినా ఇంత వరకూ దర్యాప్తు పూర్తి చేయలేదని విక్రమ్ గుర్తు చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?