Saturday, April 11, 2026
Homeశివ సూర్య డైలీ15 సిటీలపై పాక్ టార్గెట్

15 సిటీలపై పాక్ టార్గెట్

డ్రోన్లు, క్షిపనులు అర్థరాత్రి ప్రయోగం

అడ్డుకోని గాల్లోనే పేల్చేసిన భారత సైన్యం

జయజయహే : పాకిస్తాన్ 2025 మే 7-8 తేదీ రాత్రి డ్రోన్లు, క్షిపణులను ఉపయోగించి అవంతిపూర్, శ్రీనగర్, జమ్మూ, పఠాన్‌కోట్, అమృత్‌సర్, కపూర్థల, జలంధర్, లూధియానా, ఆదంపూర్, భట్టింద, చండీగఢ్, నల్, ఫలౌది, ఉత్తరలై, భుజ్‌తో సహా ఉత్తర, పశ్చిమ భారతదేశంలోని అనేక సైనిక స్థావరాలపై దాడి చేయడానికి ప్రయత్నించింది. భారత సైన్యం యుఎస్ గ్రిడ్, వాయు రక్షణ వ్యవస్థ ద్వారా ఈ దాడులను అడ్డుకుంది. ఈ దాడుల శిథిలాలు ఇప్పుడు అనేక ప్రదేశాల నుంచి స్వాధీనం చేసుకుంది. ఇవి పాకిస్తాన్ దాడులను నిర్ధారిస్తున్నాయి. దీంతో పాకిస్తాన్‌లోని అనేక ప్రదేశాల్లో వాయు రక్షణ రేడార్, ఇతర వ్యవస్థలను భారత సాయుధ దళాలు లక్ష్యంగా చేసుకున్నాయి. కీలకమైన సోర్స్ ప్రకారం, భారత సైన్యం లాహోర్‌లోని ఒక వాయు రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసింది. భారతదేశం ఈ దాడికి అదే శైలిలో అదే తీవ్రతతో, అదే ప్రాంతంలో ప్రతీకారం తీర్చుకుంది. ఈ ఉదయం భారత సాయుధ దళాలు పాకిస్తాన్‌లోని అనేక వాయు రక్షణ రేడార్, వ్యవస్థలను లక్ష్యంగా చేసుకున్నాయి. లాహోర్‌లోని ఒక వాయు రక్షణ వ్యవస్థ పూర్తిగా డీయాక్టివ్ అయ్యిందనే వార్తలు వస్తున్నాయి. భారతదేశం ఇప్పటికే పాకిస్తాన్‌లోని ఏ సైనిక ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకోలేదు. ఇదే విషయాన్ని తన ప్రకటనలో కూడా చెప్పింది. ఇరు దేశాల మధ్య యుద్ధాన్ని పెంచడం భారత్‌ ఆలోచన కాదని కూడా తెలిపింది. ఇది కేవలం ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేయడమేనని పేర్కొంది. పహల్గామ్‌ సహా దేశంలో జరిగిన ఉగ్రదాడులకు ప్రతీకారంగానే ఈ దాడి చేసినట్టు వెల్లడించింది. గురువారం ఉదయం అమృత్‌సర్‌లోని మఖన్ విండి గ్రామంలో పాకిస్తాన్ క్షిపణి శకలాలు కనిపించాయి. బుధవారం రాత్రి పేలుళ్ల శబ్దాలు వినిపించాయని స్థానికులు తెలిపారు. ఈ శిథిలాలు దొరికిన ప్రాంతాన్ని సైన్యం చుట్టుముట్టింది. ప్రభుత్వం విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం, ఈ ఉదయం పాకిస్తాన్‌లోని వివిధ ప్రాంతాల్లో మోహరించిన వైమానిక రక్షణ రాడార్లు, వ్యవస్థలపై సైన్యం దాడి చేసింది. పాకిస్తాన్ చేసిన దుష్ట ప్రయత్నానికి భారతదేశం తగిన సమాధానం ఇచ్చింది. లాహోర్‌లోని ఒక వైమానిక రక్షణ యూనిట్‌ను నిలిపివేసినట్లు కూడా తెలిసింది. పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలను పేల్చిన తర్వాత నుంచి పాకిస్థాన్‌లో భయం మరింత పెరిగింది. ఎలాగైనా భారత్‌ను దెబ్బకొట్టాలని కుట్రలు చేస్తోంది. ఏదో రూపంలో అలజడి సృష్టించాలని పన్నాగాలు పన్నుతోంది. ఎల్‌ఓసీలో కాల్పులకు తెగబడుతోంది. అమాయక ప్రజలను టార్గెట్ చేసుకుంటోంది. కుప్వారా, బారామూలా, పుంచ్, మెండర్, రాజౌరి వంటి ప్రాంతాల్లో పాకిస్తాన్ మోర్టార్, భారీ ఆర్టిలరీతో కాల్పులు జరిపింది. ఈ దుష్ట కాల్పులలో 16 మంది అమాయక భారతీయ పౌరులు మరణించారు, వారిలో ముగ్గురు మహిళలు, ఐదుగురు పిల్లలు ఉన్నారు. భారతదేశ తన ఆలోచనను స్పష్టంగా చెప్పింది. “మేము పరిస్థితిని మరింతగా ఉద్రిక్తంగా మార్చాలని అనుకోవడం లేదు. కానీ ప్రతీకారం తీసుకోవడం మాకు తెలుసు అనే విషయాన్ని చెప్పడానికే కేవలం ఉగ్ర స్థావరాలను మాత్రమే టార్గెట్ చేసుకున్నాం.” అని భారత సైన్యం స్పష్టం చేసింది. భారతదేశం యుద్ధం కోరుకోవడం లేదు. కానీ సైనిక స్థావరాలపై, పౌరులపై దాడి జరిగితే మాత్రం ప్రతీకారం తీసుకోవడంలో వెనుకడుగు వేసే ప్రసక్తి లేదని పాకిస్థాన్‌కు చెప్పకనే చెప్పింది. అందుకే ఎల్‌ఓసీలో పాకిస్తాన్ జరుపుతున్న కాల్పులకు తగిన విధంగా సమాధానం చెబుతోంది భారత్ ఆర్మీ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?