జయజయహే : జనచైతన్య వేదిక ఆంధ్రప్రదేశ్ కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 10వ తేదీ శనివారం మధ్యాహ్నం 12 గంటలకు గుంటూరు లోని రామన్నపేట ఒకటవ లైన్ లో గల జనచైతన్య వేదిక హాలులో మాజీ మంత్రి, ప్రముఖ రాజనీతిజ్ఞులు వడ్డే శోభనాద్రీశ్వరరావు తో ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి పై ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జనచైతన్య వేదిక ఆంధ్రప్రదేశ్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. శాసన మండలి సభ్యునిగా, లోక్ సభ సభ్యునిగా, రాష్ట్ర మంత్రి గా, సామాజిక ఉద్యమ నేతగా,రైతాంగ సమస్యలపై అవగాహన గల రైతు నేతగా వడ్డే శోభనాద్రీశ్వరరావు ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి పై ప్రసంగిస్తారు. కావున ఆంధ్రప్రదేశ్ లో వ్యవసాయ, విద్య, వైద్యం, సామాజిక రంగాలలో అభ్యున్నతిని గురించి ఆలోచించేవారు, అభివృద్ధి వికేంద్రీకరణ పై ఆసక్తిగల ప్రజాస్వామ్యవాదులు, అభ్యుదయ కాముకులు ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి పై వడ్డే శోభనాద్రీశ్వరరావుతో జరిగే ముఖాముఖి కార్యక్రమంలో హాజరై చర్చలో భాగస్వాములు కావాలని వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి పై ముఖాముఖి
0
50
Previous article
Next article
RELATED ARTICLES

