Wednesday, April 15, 2026
Homeవిద్య సమాచారంనారా లోకేష్ రాజీనామా చేయాలి

నారా లోకేష్ రాజీనామా చేయాలి

జయజయహే : అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ విజయనగరం శాఖ ఆధ్వర్యంలో జీవో నెంబర్ 77 రద్దు చేయాలని సెట్ ఎగ్జామ్ సెంటర్ బయట నిరసన చేసి ఎగ్జామ్ సెంటర్ లోనికి చొచ్చుకుపోయే ప్రయత్నం చేయడం జరిగింది. విద్యార్థి పరిషత్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకొని స్టేషన్ కి తీసుకు వెళ్లడం జరిగింది. ఈ కార్యక్రమంలో విభాగ్ కన్వీనర్ బొబ్బాది సాయికుమార్ మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోవడం ఎంతో సిగ్గు పడాల్సిన విషయం. ఎన్నికల ముందు తమ ప్రభుత్వం రాగానే జి నెంబర్ 77 ను రద్దు చేస్తాం అని చెప్పి ప్రభుత్వం ఏర్పడి నేటికి 329 రోజులవుతున్న దానిని పట్టించుకునే నాధుడే లేడు అని నేడు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ప్రభుత్వాన్ని నిలధీస్తుంది. ఇప్పటికైనా కళ్ళు తెరిచి విద్యార్థుల పరిస్థితిని చూడమని నారా లోకేష్ కి విజ్ఞప్తి చేస్తున్నాం. పీజీ విద్యార్థుల మెడ మీద కత్తిలా తయారైన జి నెంబర్ 77 ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాలి అని డిమాండ్ చేస్తున్నాం. ప్రతి పీజీ విద్యార్థి గొంతును కలుపుకుంటూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈనాడు సింహంలా గర్జిస్తూ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది. వెంటనే జి నెంబర్ 77 ను రద్దు చేసి విద్యార్థులకు శుభవార్త చెప్పాలని ఈనాడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కి తెలియచేస్తున్నాం. లేని పక్షంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తలు ఈ యొక్క రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని తిరగనివ్వకుండా అడ్డుకుంటారని హెచ్చరిస్తున్నాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణ, నగర సంయుక్త కార్యదర్శి చాణిక్య, నాని, యశ్వంత్, భువన్, వంశీ పాల్గొన్నారు.

                                     

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?