Thursday, April 9, 2026
Homeశివ సూర్య డైలీరైతులకు సేవ చేయడమే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల లక్ష్యం.

రైతులకు సేవ చేయడమే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల లక్ష్యం.

ప్యాక్స్ చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి.

జయజయహే : రైతులకు సేవ చేయడమే లక్ష్యంగా సొసైటీ పనిచేస్తుందని ప్యాక్స్ చైర్మన్ ఏనుగు తిరుపతిరెడ్డి అన్నారు. వేములవాడ పట్టణంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో డైరెక్టర్లతో కలిసి, ప్యాక్స్ చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి సమావేశం ఏర్పాటు చేశారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల అంశాలపై డైరెక్టర్లతో చర్చించారు. రైతులకు కొనుగోలు కేంద్రాల వద్ద ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సిబ్బందిను ఆదేశించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సొసైటీల ద్వారా గ్రామాలలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందని, వేములవాడ రూరల్ మండలం అచ్చన్నపల్లి, బొల్లారం, చెక్కపల్లి, హన్మాజీపేట, లింగంపల్లి, మల్లారం, నమిలిగుండుపల్లి, వేములవాడ అర్బన్ మండలం మారుపాక, వేములవాడ పట్టణం, మున్సిపల్ విలీన గ్రామం శత్రాజుపల్లి వార్డులో కొనుగోలు కేంద్రాలను ఏప్రిల్ 9వ తేదిన ప్రారంభం చేశామన్నారు. తేది 06.05.2025 లోపు 63 వేల 466.80 వేల వరిధాన్యం కొనుగోలు చేశామన్నారు. రైతుల కోసం సహకార సంఘాలు నిరంతరం పనిచేస్తున్నాయని, సోషల్ మీడియా వేదికగా ఓ రైతు వరిధాన్యం సెంటర్ వద్ద వీడియో తీసి సొసైటీనీ, సిబ్బందినీ అగౌరవ పరిచే విదంగా మాట్లాడటం బాధ కలిగించిందని, ఆ రైతు 26 తేదీన వరిధాన్యం ను కొనుగోలు కేంద్రానికి తీసువచ్చారని, నెల రోజుల నుండి ధాన్యం కొనుగోలు కేంద్రంలోనే ఉన్నాయని మాట్లాడరని, కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి నెల రోజులు కాలేదన్నారు. రైతులకు అండగా ఉన్నా సొసైటీ పై, సిబ్బంది పై అలా మాట్లాడకూడని వేడుకున్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి సమస్యలు ఏర్పడిన సిబ్బందిని సంప్రదించాలని, అందుబాటులో సిబ్బంది లేకుంటే తనని నేరుగా సంప్రదించవచ్చని తెలిపారు. రైతులకు ఇబ్బంది కలిగితే నేరుగా తనని నెంబరుకు 9000277222 సంప్రదించండి: అని … ప్రభుత్వంపై గాని, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం, అధికార యంత్రాంగం పై రైతులెవరు ఆరోపణలు చేయవద్దని, సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేయవద్దని కోరారు. సోషల్ మీడియాలో రైతు చేసిన ఆరోపణలను ముక్తకంఠంగా పాలకవర్గo కండిస్తున్నామన్నారు. కార్యక్రమంలో సీఈఓ లక్ష్మణ్, వైస్ చైర్మన్ లక్ష్మీ కాంతారావు, డైరెక్టర్లు తోటరాజు, జేసింత, వెంకటేశం, అమృత, మల్లేశం, సంజీవ రెడ్డి, లచ్చిరెడ్డి, సురేందర్ రెడ్డి, భూలవ్వ, రాజయ్య గౌడ్, రమేష్,తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?