రైతులకు సేవ చేయడమే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల లక్ష్యం.

ప్యాక్స్ చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి. జయజయహే : రైతులకు సేవ చేయడమే లక్ష్యంగా సొసైటీ పనిచేస్తుందని ప్యాక్స్ చైర్మన్ ఏనుగు తిరుపతిరెడ్డి అన్నారు. వేములవాడ పట్టణంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో డైరెక్టర్లతో కలిసి, ప్యాక్స్ చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి సమావేశం ఏర్పాటు చేశారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల అంశాలపై డైరెక్టర్లతో చర్చించారు. రైతులకు కొనుగోలు కేంద్రాల వద్ద ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సిబ్బందిను ఆదేశించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సొసైటీల ద్వారా...