జయజయహే : నేడు భారతదేశంలో పాలకుల దోపిడి పై అవిశ్రాంత పోరాటం చేయడమే కీ||శే|| అల్లూరి సీతారామరాజుకు ఘనమైన నివాళిని అర్పించడమని శాసనమండలి మాజీ సభ్యులు కె.ఎస్. లక్ష్మణరావు పేర్కొన్నారు. ఈనెల 7వ తేదీన గుంటూరులోని నాజ్ సెంటర్ లో గల అల్లూరి సీతారామరాజు కాంశ్య విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా కె.ఎస్. లక్ష్మణరావు 100 సంవత్సరాల క్రితం మే 7 1924న బ్రిటిష్ సైనికులు అల్లూరి సీతారామరాజు ను వేటాడి,వెంటాడి కాల్చి చంపారని తెలిపారు. బ్రిటిష్ దోపిడికి వ్యతిరేకంగా గిరిజనులను ఐక్యం చేసి స్వాతంత్ర పోరాటంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు గడుస్తున్న గిరిజనుల జీవితంలో పెద్ద మార్పు రాలేదన్నారు. అల్లూరి సీతారామరాజు ఆశయ సాధన కోసం ఐక్య ఉద్యమాలు చేయాలన్నారు. జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ ఆనాటి బ్రిటిష్ పాలనలో జరిగిన దోపిడీ కన్నా 100 రెట్లు దోపిడి నేడు కొనసాగుతుందని, సహజ వనరులను, అటవీ సంపదను నేటి పాలకవర్గాల ప్రతినిధులు, కార్పొరేట్ సంస్థలు దోచుకుంటున్నారని, 18 లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్ సంస్థలు బ్యాంకుల నుండి తీసుకున్న ఋణాలను రద్దు చేసినారని, గిరిజనులు అత్యంత దారుణ పరిస్థితులను ఎదుర్కొంటున్నారని వివరించారు. అసమానతలు లేని సమాజాన్ని, దళిత, గిరిజన అభ్యున్నతని, దోపిడీ లేని సమాజ కల్పన కోసం కృషి చేయడమే అల్లూరి సీతారామరాజు కు నిజమైన నివాళిని అర్పించడం అన్నారు. అవగాహన కార్యదర్శి కొండా శివరామిరెడ్డి ప్రసంగిస్తూ సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి, ఉద్యమించి ,ప్రాణాలర్పించిన యోధుడు అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. 20 సంవత్సరాల చిన్న వయసులోనే విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల గిరిజనులను ఐక్యం చేసి పోరాట పటిమను నేర్పి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించి 26 సంవత్సరాల వయస్సులో ప్రాణాలర్పించిన యువ కెరటం అల్లూరి సీతారామరాజు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ యోగ గురువు అచ్యుత ఇందు శేఖర్, అవగాహన సభ్యులు ఎల్. మురళీకృష్ణ, ఎస్ కృష్ణారావు, ఇ. చంద్రయ్య, ఆర్. వెంకటరత్నం తదితరులు నివాళులు అర్పించారు.
పాలకుల దోపిడి పై పోరాడటమే కీ”శే”అల్లూరికు ఘనమైన నివాళి
0
47
Previous article
Next article
RELATED ARTICLES

