పాలకుల దోపిడి పై పోరాడటమే కీ”శే”అల్లూరికు ఘనమైన నివాళి
జయజయహే : నేడు భారతదేశంలో పాలకుల దోపిడి పై అవిశ్రాంత పోరాటం చేయడమే కీ||శే|| అల్లూరి సీతారామరాజుకు ఘనమైన నివాళిని అర్పించడమని శాసనమండలి మాజీ సభ్యులు కె.ఎస్. లక్ష్మణరావు పేర్కొన్నారు. ఈనెల 7వ తేదీన గుంటూరులోని నాజ్ సెంటర్ లో గల అల్లూరి సీతారామరాజు కాంశ్య విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా కె.ఎస్. లక్ష్మణరావు 100 సంవత్సరాల క్రితం మే 7 1924న బ్రిటిష్ సైనికులు అల్లూరి సీతారామరాజు ను వేటాడి,వెంటాడి కాల్చి చంపారని తెలిపారు. బ్రిటిష్ దోపిడికి వ్యతిరేకంగా...