ePaper
Sunday, June 7, 2026
ePaper
Homeశివ సూర్య డైలీప్రపంచ మహా సభలకు తెలుగు ప్రజలు తరలి రావాలి!

ప్రపంచ మహా సభలకు తెలుగు ప్రజలు తరలి రావాలి!

📰 Generate e-Paper Clip

3 వ ప్రపంచ తెలుగు మహా సభల “ప్రచార పత్రిక ” విడుదల చేసిన డా. పెమ్మసాని చంద్రశేఖర్

అమరావతి కి అపూర్వ ఆంధ్ర వైభవం.

గుంటూరు: జయ జయహే: 2026 జనవరి 3,4,5 తేదీలలో లో జరగ బోయే 3 వ ప్రపంచ తెలుగు మహా సభలకు తెలుగు ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని, ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆంధ్ర మేవ జయతే! అన్న నినాదం తో నిర్వహిస్తున్న తెలుగు పండుగ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా గుంటూరు , అమరావతి జరుగనుండడం అందరకీ గర్వకారణం అని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డా. పెమ్మ సాని చంద్రశేఖర్ అన్నారు. నేను తెలుగు మాధ్యమంలో విద్యాభ్యాసం చేసానని, శ్రీ కృష్ణ దేవరాయలు, తెనాలి రామకృష్ణ, వాగ్గేయకారులు, అన్న ఎన్ .టీ.ఆర్ లాంటి మహానుభావుల స్ఫూర్తి మనమందరమూ కొనసాగించాలని ఆయన అన్నారు. భారతీయ విద్యా భవన్ , గుంటూరు ప్రాంగణం లో 3 వ ప్రపంచ తెలుగు మహా సభల “ప్రచార పత్రిక ” ను కేంద్ర మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ విడుదల చేసారు. గొప్ప విద్యా, అధ్యాత్మిక కేంద్ర మైన గుంటూరు శ్రీ సత్య సాయి స్పిరిచువల్ సిటీ ప్రాంగణం 3 వ ప్రపంచ తెలుగు మహా సభలకు వేదిక కావడం మాకు ఎంతో ఆనందం గా వుందని శ్రీ సత్యసాయి విద్యాసంస్థల చైర్మన్, గుంటూరు నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర అన్నారు. పరిషత్తు అధ్యక్షులు డా.గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఆంధ్ర సాంస్కృతిక,సాహితీ వైభవాన్ని , తెలుగు భాషా వెలుగులను దశ దిశలా ప్రసరింపజేసేదిశగా సభలు నిర్వహిస్తామని, లక్షలాది మంది యువతీ యువకులు సాంస్కృతిక ప్రదర్శనలలో పాల్గొని తెలుగు భాష కు నూతన ఉత్తేజం కలుగ జేస్తార ని ఆయన తెలిపారు. ముఖ్య సమన్వయకర్త పి. రామచంద్ర రాజు వందన సమర్పణ చేశారు.ఈ సభలో కార్యదర్శి ధవేజి, ఉపాధ్యక్షులు మేడికొండ శ్రీనివాస్ చౌదరి, సహా సమన్వయకర్త వాసిరెడ్డి విద్యాసాగర్ లు పాల్గొన్నారు.

                             

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!