Saturday, April 11, 2026
Homeశివ సూర్య డైలీశ్రామికులే "దేశానికి" సంపద, ప్రతీ శ్రామికున్ని గుర్తించాలి - ప్రిన్సిపాల్ జడ్జి ఎం. శ్రీధర్

శ్రామికులే “దేశానికి” సంపద, ప్రతీ శ్రామికున్ని గుర్తించాలి – ప్రిన్సిపాల్ జడ్జి ఎం. శ్రీధర్

శ్రీకాకుళం: జయజయహే : శ్రామికులే “దేశానికి” నిజమైన సంపదని, ప్రతీ శ్రామికుని కష్టాన్ని మనం గుర్తించాలని, జిల్లా లీగల్ సెల్ అధారిటీ శ్రీకాకుళం, ప్రిన్సిపాల్ జడ్జి ఎం. శ్రీధర్ అన్నారు. స్థానిక కోర్టు ఆవరణ ప్రాంగణంలో మే డే ప్రత్యేకతను అందరికీ అర్ధమయ్యేలా సీనియర్ న్యాయవాది ఇందిరా ప్రసాద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జడ్జి ఎం. శ్రీధర్, డిప్యూటీ కమీషనర్ ఆఫ్ లేబర్, కె. అజయ్ కార్తికేయ లు ముఖ్య అతిధులుగా పాల్గొని ప్రసంగించారు. ఐక్యతకు నిదర్శనం కార్మికులని, కార్మికుడు తన చెమట కష్టంతో పని చేస్తూ ప్రపంచానికే వెన్నుముకగా నిలుస్తున్నారన్నారు. కార్మికుల శ్రమకు తగిన గుర్తింపు ఇస్తూ జరుపుకునే పండుగే కార్మిక దినోత్సవమని, మే డే కార్మికుల ఐక్యత, పోరాటాలకు నిదర్శనంగా నిలుస్తుందన్నారు. కార్మికులు లేకపోతే మనం లేమనే వాస్తవాన్ని గ్రహించాలని, వారి శ్రమ వల్లే దేశం సుస్థిర స్థానాన్ని సంపాదించిందని ఇందిరా ప్రసాద్ అన్నారు. కార్మికులకు ఎనిమిది గంటల పని విధానం గురించి నినదిస్తూ 1886, మే 1న చాలామంది కార్మికులు పోరాటం చేపట్టారని, దానికి మద్దతుగా నాలుగు రోజుల తరవాత షికాగోలోని హే మార్కెట్లో చాలామంది ప్రదర్శన నిర్వహించారు. కానీ ఆ ప్రదర్శన ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో కొందరు కార్మికులు చనిపోయారని గుర్తు చేశారు. రోజులో కేవలం 8 గంటలు మాత్రమే పనివేళలు ఉండాలన్నదే ఆ ప్రదర్శనలో పాల్గొన్న వారి ప్రధాన డిమాండ్ అని, ఆ పైన అనేక యూరోపియన్ దేశాల్లో ఇదే నినాదంతో ప్రదర్శనలు జరిగాయన్నారు. క్రమంగా షికాగోలో జరిగిన కార్మిక ప్రదర్శనలో చనిపోయిన వారికి గుర్తుగా మే 1ని కార్మిక దినోత్సవంగా జరుపుకోవాలన్న ఒప్పందం కూడా కుదిరిందని, ఆపై ప్రపంచవ్యాప్తంగా మేడే స్వరూపం మారుతూ వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో కార్మిక బృందం, న్యాయవాదుల బృందం, విద్యార్థినీ, విద్యార్థులు, మహిళలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?