ePaper
Sunday, June 7, 2026
ePaper
Homeశివ సూర్య డైలీచురుగ్గా సాగుతున్న చలసింగం రహదారి పనులు

చురుగ్గా సాగుతున్న చలసింగం రహదారి పనులు

📰 Generate e-Paper Clip

పనులను పర్యవేక్షించిన చోడవరం జనసేన రాజు

చోడవరం: జయజయహే : రావికమతం మండలంలో గల గిరిజన చలిసింగం గ్రామానికి రహదారి నిర్మాణం పనులను చోడవరం జనసేన పార్టీ ఇంచార్జ్ పివిఎస్ఎన్ రాజు శనివారం పర్యవేక్షించారు .పనులు శరవేగంతో జరుగుతున్నాయని రెండున్నర కిలోమీటర్లు రహదారికి మొదటి దశ పనులు పూర్తయ్యాయని తెలిపారు.రాతిబండలను కట్ చేయడంతో పాటు రోడ్డుకు సంబంధించిన ప్రాథమిక పనులన్నీ పూర్తి అయ్యాయని రెండవ దశ పనులకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని, మూడు నుండి నాలుగు నెలలుగా రెండవ దశ పనులు పూర్తవుతాయని రోడ్డు కాంట్రాక్టర్ తెలియ చేశారు. ఈ కార్యక్రమంలో రావికమతం రోలుగుంట మండల పార్టీ అధ్యక్షులు మైచర్ల నాయుడు , బలిజ మహారాజు, నాయకులు చింతల కిషోర్, పరవాడ దొరబాబు , కె అప్పారావు , కోన రమణ ,ఇటంశెట్టి ఈశ్వరరావు , సోమిరెడ్డి శివశంకర్, చలిసింగం గ్రామ పార్టీ నాయకులు కిముడు గాంధీ, రమేష్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం

చలిసింగం గ్రామ జనసైనికులకు, వీర మహిళలకు పార్టీ క్రియా శీల సభ్యత్వ కార్డులను ఇంచార్జి పివిఎస్ఎన్ రాజు , మండల పార్టీ అధ్యక్షులు మైచర్ల నాయుడు చేతుల మీదుగా అందజేశారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!