Saturday, April 11, 2026
Homeసినిమాచిత్రసీమలో రాఘవేంద్రరావుకు 50 వసంతాలు

చిత్రసీమలో రాఘవేంద్రరావుకు 50 వసంతాలు

భీమవరంలో రాఘవేంద్రరావుకు శుభాకాంక్షలు తెలుపుతూ అభినందన సభ

భీమవరం : దర్శకేంద్రులు కె రాఘవేంద్రరావు చిత్రసీమలో అడుగుపెట్టి 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం అఖిల భారత శోభన్ బాబు సేవా సమితి కన్వీనర్ భట్టిప్రోలు శ్రీనివాసరావు,రాఘవేంద్రరావు అభిమాని బొండా రాంబాబు ఆధ్వర్యంలో భీమవరం వెంకట్రామ థియేటర్ హాల్లో శుభాకాంక్షలు తెలుపుతూ అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా రాఘవేంద్ర రావు కు రాంబాబు విడియో కాల్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేసి కేక్ కట్ చేశారు. ఈ సందర్బంగా థియేటర్ మేనేజర్ గన్నాబత్తుల శ్రీనివాస్, రాఘవేంద్రరావు అభిమాని, మార్నింగ్ కాఫీ క్లబ్ కన్వీనర్ బొండా రాంబాబు, కో కన్వీనర్ ఓలేటి శ్రీనివాస్ మాట్లాడుతూ రాఘవేంద్ర రావు 1975లో చిత్ర పరిశ్రమకు వచ్చి ఎన్నో చిత్రాలు చేశారని, రానున్న రోజుల్లో మరెన్నో చిత్రాలు చేయాలని కోరుకుంటున్నామన్నారు. వెండి తెరను పువ్వులు, ఫలాలుతో అభిషేకించిన సినీ దిగ్గజ దర్శకుడు రాఘవేంద్రరావు అని, రాఘవేంద్ర రావు దర్శకత్వ ప్రస్థానానికి 50 ఏళ్లు పూర్తి కావడం గొప్ప విశేషమని, రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన మొదటి సినిమా ‘బాబు’ విడుదలై మే 2కి 50 ఏళ్లు అవుతుందన్నారు. కన్వీనర్ భట్టిప్రోలు శ్రీనివాసరావు, చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ దర్శకేంద్రులు రాఘవేంద్రరావు ఎన్నో అద్భుతమైన సినిమాలను తెరకెక్కించి తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ప్రత్యేక పేజీని ఏర్పాటు చేసుకున్నారని అన్నారు. కార్యక్రమంలో కారుమూరి భాస్కరరావు, మడిపల్లి శేఖర్, వబిలిశెట్టి వెంకటేశ్వరరావు, ప్రసాద్, పెదపాటి రాజబాబు, పులపర్తి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?