Saturday, April 11, 2026
Homeసినిమామంచు మోహన్‌బాబుకు సుప్రీంకోర్టులో చుక్కెదురు

మంచు మోహన్‌బాబుకు సుప్రీంకోర్టులో చుక్కెదురు

ప్రముఖ సినిమా నటుడు, నిర్మాత మంచు మోహన్‌బాబుకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనపై పోలీసులు పెట్టిన కేసును కొట్టివేయాలన్న ఆయన అభ్యర్థనను సుప్రీం తోసిపుచ్చింది. మే 2న తప్పనిసరిగా తిరుపతి మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరు కావలసిందేనని తేల్చి చెప్పింది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించాలని కోరుతూ 2019లో తిరుపతి-మదనపల్లె జాతీయ రహదారిపై విద్యార్థులతో కలిసి మోహన్‌బాబు కుటుంబం ధర్నాకు దిగింది. అప్పటికే ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండడంతో.. మోహన్‌బాబుతో పాటు మరికొందరిపై కేసు నమోదైంది. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారని, ప్రజలను ఇబ్బందులకు గురిచేశారని, ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారని చంద్రగిరి పోలీసులు పేర్కొన్నారు. 2021లో కోర్టులో చార్జిషీటు కూడా సమర్పించారు. అయితే ఆ కేసును క్వాష్‌ చేయాలని కోరుతూ ఈ ఏడాది మార్చి 30న మోహన్‌బాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌ బుధవారం జస్టిస్‌ బేలా ఎం.త్రివేది, జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. పిటిషనర్‌ తరపున సీనియర్‌ న్యాయవాది నిఖిల్‌ గోయల్‌ వాదనలు వినిపించారు…..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?