ePaper
Saturday, June 6, 2026
ePaper
Homeశివ సూర్య డైలీచోడవరం అంతర్జాతీయ కార్మిక దినోత్సవ వేడుకలు

చోడవరం అంతర్జాతీయ కార్మిక దినోత్సవ వేడుకలు

📰 Generate e-Paper Clip

చోడవరం, జయజయహి : చోడవరం మండలంలోని గురువారం అంతర్జాతీయ కార్మిక దినోత్సవ వేడుకలను కార్మిక సంఘాలు నిర్వహించాయి.ప్రపంచ కష్టజీవుల, పీడిత ప్రజలు పోరాడి సాధించుకున్న హక్కుల పోరాట దీక్ష దినం మేడే జెండాను బానయ్య కోనేరులోని రైతు కూలీ సంఘం కార్యలయం వద్ద , గోవాడ మహిళ భవన నిర్మాణ కార్మికుల సంఘం బిల్డింగ్ వద్ద జెండాలను ఆవిష్కరించారు. సందర్భంగా ఏ.ఐ.ఎఫ్.టి.యు జిల్లా నాయకులు అయితిరెడ్డి అప్పలనాయుడు, రైతు కూలీ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కిల్లి దేవుళ్ళు, స్త్రీ విముక్తి సంఘటన నాయకురాలు ఓ లక్ష్మీ కుమారి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన లేబర్ కోడ్లు ఎనిమిది గంటల పని దినాన్ని 12 గంటలకు, సంఘం ఏర్పాటు చేసుకునే హక్కులు లేకుండా చేయడం, కార్మికులకి ఇప్పటి వరకు ఉన్న పెన్షన్ మిగతా హక్కును కూడా హరించేసే దుర్మార్గ చట్టాలు తీసుకొస్తుందనీ అన్నారు. కాబట్టి ఈ లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని, అలాగే కార్మికులకు సరైన భద్రత ప్రమాణాలు లేకుండా తక్కువ వేతనాలతో కార్మికుల శ్రమను కార్పొరేటు, ప్రైవేటు కంపెనీలు దోచుకుంటున్నాయనీ అన్నారు.ఈ దోపిడీని ఆపాలని, పెరుగుతున్న నిత్యవసర సరుకుల ధరలు తగ్గించాలని, రైతుల పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, కుల, మత, ప్రాంతీయ ఉన్మాదాల తో రెచ్చగొట్టి రాజకీయాలు చేస్తున్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలందరూ ఎర్రజెండా స్ఫూర్తితో ఐక్యంగా పోరాడాలని నాయకులు పిలిపిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎన్. వై.ఎస్ రాష్ట్ర నాయకులు నందారపు భాస్కరరావు, ఏ లక్ష్మి, కె. కన్నయ్యమ్మ,ఆర్.దుర్గ తదితరులు పాల్గొన్నారు. కార్మిక దినోత్సవం సందర్బంగా సిపిఐ జిల్లా సమితి సభ్యుడు ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో మహిళా ప్రజా సంఘాలు పాల్గొన్నాయి.ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యురాలు గూనూరు వరలక్ష్మి, రైతు సంఘం నాయకులు నాగిరెడ్డి సత్యనారాయణ, ఆశ సంఘం కార్యకర్తలు వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!