Monday, April 13, 2026
Homeశివ సూర్య డైలీస్త్రీలు రక్తదానం చేసి, అందరిలో స్ఫూర్తినింపారు - డిసిసిబి అధికార బృందం

స్త్రీలు రక్తదానం చేసి, అందరిలో స్ఫూర్తినింపారు – డిసిసిబి అధికార బృందం

శ్రీకాకుళం : జయజయహే : ఇంటర్నేషనల్ కో-ఆపరేటివ్ ఇయర్ సందర్భంగా జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని రెడ్ క్రాస్ రక్తనిధి కేంద్ర సహకారంతో నిర్వహించారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ఉద్యోగులు, సహకార సంఘముల ఉద్యోగులు రక్తదాన శిబిరంలో పాల్గొని, రక్తదానం చేశారని, పురుషులకు ధీటుగా, స్త్రీలు ముందుకువచ్చి రక్తదానంచేసి అందరిలో స్ఫూర్తినింపారని బ్యాంకు అధికారులు తెలిపారు. ముఖ్యంగా నగరంలో రక్త కొరతకారణంగా, ఒక మంచి కార్యక్రమం చెయ్యాలనే ఉద్దేశ్యంతో రక్తదాన శిబిరాన్ని నిర్వహించామన్నారు. రెడ్ క్రాస్ సెక్రటరీ బలివాడ. మల్లేశ్వర రావు మాట్లాడుతూ ఇంటర్నేషనల్ కో-ఆపరేటివ్ ఇయర్ సందర్భంగా రక్తదానం చెయ్యటం హర్షణీయమని, వేసవిలో రక్తనిల్వాలు తక్కువ ఉంటాయని, సామాజిక బాధ్యతతో ఆలోచించి రక్తదానం చెయ్యటయేకాకుండా, స్త్రీలు కూడా మానవతా దృక్పధంతో అలోచించి రక్తదానంచెయ్యటం మాటలకందని విషయమన్నారు. ఇప్పటి వరకు సుమారు వంద మంది ఉద్యోగులు రక్తదానం చేశారని రెడ్ క్రాస్ బృందం తెలిపారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి అధికార ఉద్యోగులు, రక్తదాతలు, రెడ్ క్రాస్ జాతీయ యువజన అవార్డ్స్ గ్రహీత పెంకి. చైతన్య, పీఆర్వో సత్యన్నారాయణ, శాశ్వత సభ్యులు బి. చిన్మయ రావు, ఎపిఆర్వో నంది. ఉమా శంకర్, బి. జగదీశ్ ఇతర సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?