స్త్రీలు రక్తదానం చేసి, అందరిలో స్ఫూర్తినింపారు – డిసిసిబి అధికార బృందం

శ్రీకాకుళం : జయజయహే : ఇంటర్నేషనల్ కో-ఆపరేటివ్ ఇయర్ సందర్భంగా జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని రెడ్ క్రాస్ రక్తనిధి కేంద్ర సహకారంతో నిర్వహించారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ఉద్యోగులు, సహకార సంఘముల ఉద్యోగులు రక్తదాన శిబిరంలో పాల్గొని, రక్తదానం చేశారని, పురుషులకు ధీటుగా, స్త్రీలు ముందుకువచ్చి రక్తదానంచేసి అందరిలో స్ఫూర్తినింపారని బ్యాంకు అధికారులు తెలిపారు. ముఖ్యంగా నగరంలో రక్త కొరతకారణంగా, ఒక మంచి కార్యక్రమం చెయ్యాలనే ఉద్దేశ్యంతో రక్తదాన శిబిరాన్ని నిర్వహించామన్నారు. రెడ్ క్రాస్ సెక్రటరీ...