ePaper
Saturday, June 6, 2026
ePaper
Homeశివ సూర్య డైలీపాక్ కు అనుకూలంగా మాట్లాడితే వెళ్లిపోండి

పాక్ కు అనుకూలంగా మాట్లాడితే వెళ్లిపోండి

📰 Generate e-Paper Clip

డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలు వివాదం

మధుసూదన్‌రావు ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించిన పవన్

జయజయహే : మత ప్రాతిపదికన 26 మందిని చంపినా పాకిస్థాన్‌కు అనుకూలంగా మాట్లాడటం సరికాదని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. అలా మాట్లాడాలనుకుంటే పాకిస్థాన్‌కే వెళ్లిపోవాలని అన్నారు. మత ప్రాతిపదికన చంపడం సరికాదని అన్నారు. ఇటీవల జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి మంగళగిరి సీకే కన్వెన్షన్‌లో హాలులో జనసేన పార్టీ తరపున నివాళుల కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా పవన్‌ కల్యాణ్ మాట్లాడుతూ ఉగ్రవాదం, హింసపై అందరూ ఒకేలా స్పందించాలని అన్నారు. కశ్మీర్‌ భారత్‌లో భాగమని, ఇలాంటి విషయాలపై ఓట్లు, సీట్ల కోసం మాట్లాడకూడదని చెప్పారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలికి చెందిన మధుసూదన్‌రావు కుటుంబానికి పార్టీ తరఫున రూ.50 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించారు. ఉగ్రఘటనలో జనసేన ఓ కార్యకర్తను కోల్పోయిందని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. సత్యం మాట్లాడాలంటే చాలా ధైర్యం కావాలని చెప్పారు. చనిపోయిన మధుసూదన్‌రావు ఎవరికి హాని చేశారని కుటుంబాన్ని తీసుకొని కశ్మీర్‌కు వెళ్తే చంపేశారని పవన్ అన్నారు.

గుర్తింపుకార్డు అడిగి కాల్చి చంపారు

కశ్మీర్‌ మనది కాబట్టే అక్కడికి వెళ్లామని అలానే ఉగ్రవాదులు గుర్తింపుకార్డు అడిగి కాల్చి చంపారని మధు భార్య చెప్పారని పవన్ తెలిపారు. హిందువులకు ఉన్న దేశం ఇదొక్కటేనని పవన్ తెలిపారు. ఇక్కడ కూడా ఉండొద్దంటే ఎక్కడికి పోవాలని అన్నారు. యుద్ధ పరిస్థితులు వచ్చినా సిద్ధంగా ఉండాలని మత కలహాలు సృష్టించే వారిపై అప్రమత్తంగా ఉండి ఎదుర్కోవాలని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. కశ్మీర్‌లో జరిగితే ఆ ప్రకంపనలు మనకు తగిలాయని సరిహద్దు నియంత్రణ వద్ద విధులు చాలా కష్టమని అన్నారు. ఉగ్రవాదులను ఎలాంటి పరిస్థితుల్లో ఉపేక్షించవద్దని వివరించారు.

ఉగ్రవాదుల ఏరివేతకు ఎన్డీయే కి సహకారం: పవన్ కల్యాణ్, డిప్యూటీ సీఎం

భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. ఉగ్రవాదుల ఏరివేతలో ప్రతి ఒక్కరూ ఎన్డీయేకు మద్దతుగా నిలవాలి. దేశంలో సహనం ఎక్కువైంది అతి సహనం మంచిది కాదు. కొత్త వ్యక్తుల కదలికలపై నిఘా ఉండాలి. ఇప్పటికైనా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. తప్పు జరిగినప్పుడు తప్పు అని చెప్పాలి. ముస్లింలపై వివక్ష చూపిస్తే ఇంతమంది ఇక్కడ ఎలా ఉంటారు. శరణార్థులు దేశానికి అదనపు భారం అని పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!