పాక్ కు అనుకూలంగా మాట్లాడితే వెళ్లిపోండి

డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలు వివాదం మధుసూదన్‌రావు ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించిన పవన్ జయజయహే : మత ప్రాతిపదికన 26 మందిని చంపినా పాకిస్థాన్‌కు అనుకూలంగా మాట్లాడటం సరికాదని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. అలా మాట్లాడాలనుకుంటే పాకిస్థాన్‌కే వెళ్లిపోవాలని అన్నారు. మత ప్రాతిపదికన చంపడం సరికాదని అన్నారు. ఇటీవల జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి మంగళగిరి సీకే కన్వెన్షన్‌లో హాలులో జనసేన పార్టీ తరపున నివాళుల కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా పవన్‌ కల్యాణ్ మాట్లాడుతూ...