ePaper
Saturday, June 6, 2026
ePaper
Homeశివ సూర్య డైలీమానవతకు మరో కోణం "సెన్సిటివ్ రైడర్స్" పోస్టర్ను ఆవిష్కరించిన 79 వ వార్డు కార్పొరేటర్ రౌతు...

మానవతకు మరో కోణం “సెన్సిటివ్ రైడర్స్” పోస్టర్ను ఆవిష్కరించిన 79 వ వార్డు కార్పొరేటర్ రౌతు శ్రీనివాసరావు

📰 Generate e-Paper Clip

జయజయహే : అగనంపూడి వాకింగ్ ట్రాక్ లోదేశంలో సరికొత్త మానవీయ ఉద్యమానికి అంకురార్పణ జరిగింది. జూనియర్ చాంబర్ ఇంటర్నేషనల్ రూపకల్పన చేసిన”సెన్సిటివ్ రైడర్స్” పోస్టర్ని శ్రీనివాసరావు అవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నేటి సమాజంలో రద్దీగా ఉన్న సమయంలో ప్రయాణం చేస్తున్నప్పుడు టు వీలర్ కార్లు ట్రావెల్స్ లారీలు మొదలగు వాహనాలు డ్రైవర్స్ తమ ముందు వెళ్తున్న వాహనాలు లో ప్రయాణం చేస్తున్న వారి పరిస్థితి తెలియకుండా వీరు ఇష్టమొచ్చినట్టు వాహనాలు నడుపుతుంటారు దానికి సెన్సిటివ్ డ్రైవర్స్ ఎస్ సింబల్ తో ఉన్న స్టిక్కర్ మనం డ్రైవ్ చేస్తున్న వాహనం వెనకాల అంటించినట్లయితే వెనుక వచ్చే డ్రైవర్స్ కి మన విషయం తెలిసి నెమ్మదిగా వెళ్తారు అని అన్నారు. జె సి ఐ విశాఖ స్టీల్ సిటీ అధ్యక్షురాలు ది వింగ్స్ ఆఫ్ మైండ్ వ్యవస్థాపకరాలు జెసి రమ్య అగస్తి మాట్లాడుతూ ఎల్ బోర్డు ఉన్న వాహనాలు వెనుక వెళ్లే వాహనాలు వారు ఇతనికి సరిగా డ్రైవింగ్ రాదు అని వీలు జాగ్రత్తగా నెమ్మదిగా వారిని తప్పించుకుని వెళ్తుంటారు అదేవిధంగా ఈ సెన్సిట్ రైడర్ స్టిక్కర్ ఆవశ్యకత ఏమిటంటే శబ్దము. ర్యాష్ డ్రైవింగ్, వేగంగా వాహనము నడపడం ,సడన్గా బ్రేకులు వేయడం వల్ల ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మళ్లీ తీవ్రత అస్వస్థతకు గురవుతారు. కావున సెన్సిట్ రైడర్స్ స్టిక్కర్ వాహనాలు వెనుక అంటించాలని దీనిపై గవర్నమెంట్ కూడా తగు ఆదేశాలు ఇవ్వాలని అన్నారు. స్పందన చేయూత ఫౌండేషన్ చైర్మన్ ఈవూరి బుచ్చిరాజు సభ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఏ డి సి చైర్మన్ బలిరెడ్డి సత్యనారాయణ జెసిఐ ప్రతినిధి యోగేష్ కుమార్ గార్గే అగనంపూడి వాకర్స్ క్లబ్ అధ్యక్షులు మడుగుల నర్సింగరావు స్థానిక నాయకులు గళ్ళ రాజు గుదే సుశీల గజేంద్ర డొక్కా రమేష్ బోండా ఈశ్వరరావు కాకినాడ శ్రీను కరణం పైడ్రాజు గొల్లపల్లి వెంకట్రావు బోండా ఈశ్వరరావు గొల్లవిల్లి కనక భవాని తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!