విచారణ రెండు వారల వాయిదా
జయజయహే : మద్యం కుంభకోణం కేసు లో ముందస్తు బెయిల్ కోసం వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం విచారణ జరిగింది. జస్టిస్ జె.బి.పార్దివాలా, జస్టిస్ ఆర్ మహాదేవన్ ధర్మాసనం కేసు విచారణ జరిపింది. వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది. ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్పై సమాధానానికి సమయం కావాలని మిధున్ రెడ్డి తరపు న్యాయవాదులు కోరారు. దీంతో విచారణ రెండు వారాలు వాయిదా పడింది. మద్యం కేసులో తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని, తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఎంపీ మిధున్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే దీన్ని హైకోర్టు కొట్టివేసింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. పిటిషన్ స్వీకరించి విచారణ జరిపిన ధర్మాసనం మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దంటూ ఆదేశాలు జారీ చేయడంతో పాటు విచారణకు సహకరించాలని ఎంపీని ఆదేశించిన విషయం తెలిసిందే.

