ePaper
Monday, June 8, 2026
ePaper
Homeశివ సూర్య డైలీగంజాయి కేసులో ముద్దాయికి 10 ఏళ్లు కఠిన కారాగార శిక్ష లక్ష జరిమానా

గంజాయి కేసులో ముద్దాయికి 10 ఏళ్లు కఠిన కారాగార శిక్ష లక్ష జరిమానా

📰 Generate e-Paper Clip

చోడవరం 9వ అదనపు సెషన్స్ జడ్జి తీర్పు

జరిమానా చెల్లించని పక్షంలో మరో 6 నెలల సాధారణ జైలు శిక్ష విధించిన కోర్టు

చోడవరం: జయజయహే : చీడికాడ పోలీస్ స్టేషన్ పరిధిలో 2015 డిసెంబరు 28 న నమోదైన గంజాయి కేసులో నిందితులు జాజిమొగ్గల సంతోష్, గెంజి మరిడి బాబు, జాజిమొగ్గల దేముడులు పై చోడవరం 9వ అదనపు సెషన్స్ జడ్జి , కె రత్నా కుమార్ శిక్ష విధిస్తూ తీర్పు వెలువడించరని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, సోమవారం తెలిపారు.

కేసు వివరాలు పరిశీలిస్తే 2015 డిసెంబర్ 28 ఉదయం 9:00 గంటలకు, చీడికాడ పోలీస్ స్టేషన్ పరిధిలో, జి కొత్తపల్లి అవుట్ స్క్రిట్స్ వద్ద ముద్దాయి లు 100 కేజీల గంజాయిని రవాణా చేస్తూ పట్టుబడ్డాడు. ఎస్సై ఏ. కోటేశ్వరరావు , సిబ్బంది మధ్యవర్తుల సమక్షంలో తనిఖీ చేసి 100 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. చీడికాడ ఎస్సై కోటేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు పూర్తి చేసి న్యాయస్థానంలో అభియోగపత్రం దాఖలు చేశారు.ఈ కేసులో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ యు. వెంకట రావు వాదనలు సమర్థంగా వినిపించగా, చోడవరం 9వ అదనపు సెషన్స్ జడ్జి కే రత్నా కుమార్ ముద్దాయి లకు 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ. లక్ష జరిమానా విధిస్తూ తీర్పును వెల్లడించారు. జరిమానా చెల్లించని పక్షంలో 2 .6 ఏళ్లు సాధారణ జైలు శిక్ష విధించబడుతుందనీ తెలిపారు.జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, దర్యాప్తు అధికారి ఎస్సై ఏ కోటేశ్వరరావు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ యు వెంకట రావు, , కోర్టు మానిటరింగ్ సెల్ సిబ్బంది, నిందితులకు శిక్ష పడేలా నిర్ధారించిన అధికారులు అందరికీ అభినందనలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!