ePaper
Monday, June 8, 2026
ePaper
Homeశివ సూర్య డైలీప్రారంభమైన టిడిపి సంస్థాగత ఎన్నికల కార్యక్రమం

ప్రారంభమైన టిడిపి సంస్థాగత ఎన్నికల కార్యక్రమం

📰 Generate e-Paper Clip

మాడుగుల : జయజయహే : మాడుగుల మండలంలో సోమవారం నుంచి తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికల కార్యక్రమం ప్రారంభమైంది. మే ఆరో తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో నిర్వహించి గ్రామ కమిటీలను ఎన్నుకుంటారు. దానిలో భాగంగా తొలిరోజు సోమవారం మండలంలో ఆవురువాడ, కే వల్లాపురం, కింతలి, జేడిపేట గ్రామాల్లో గ్రామ కమిటీ ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో ఆవురువాడ గ్రామ కమిటీకి అధ్యక్ష కార్యదర్శులుగా దారా భీమరాజు, తంటపరెడ్డి వరహాల నాయుడు ఎన్నికయ్యారు, అలాగే కేవల్లాపురం గ్రామానికి మజ్జి బాబ్జి, బగుడు భూషణం అధ్యక్ష కార్యదర్శులకు ఎన్నికయ్యారు, ఇక కింతలి గ్రామానికి అల్లా రాము,కోన నాగరాజు అధ్యక్ష కార్యదర్శులు ఎన్నికయ్యారు. జెడి పేట గ్రామానికి సాడి అర్జున, వెల్లంకి సత్యనారాయణ అధ్యక్ష కార్యదర్శులుగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో మాడుగుల మార్కెట్ కమిటీ చైర్మన్ పుప్పాల అప్పలరాజు, మండల పార్టీ అధ్యక్షుడు కార్యదర్శులు అద్దేపల్లి జగ్గారావు, ఉండూరు దేవుడు, పార్టీ క్లస్టర్ ఇన్చార్జి పుప్పాల రమేష్, వడ్డే రాజకుమార్, ఎంపీటీసీ బీసెట్టి శ్రీనివాసు తదితరులు హాజరై నూతన అధ్యక్షుడు సత్కరించారు.

                   

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!