ప్రారంభమైన టిడిపి సంస్థాగత ఎన్నికల కార్యక్రమం
మాడుగుల : జయజయహే : మాడుగుల మండలంలో సోమవారం నుంచి తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికల కార్యక్రమం ప్రారంభమైంది. మే ఆరో తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో నిర్వహించి గ్రామ కమిటీలను ఎన్నుకుంటారు. దానిలో భాగంగా తొలిరోజు సోమవారం మండలంలో ఆవురువాడ, కే వల్లాపురం, కింతలి, జేడిపేట గ్రామాల్లో గ్రామ కమిటీ ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో ఆవురువాడ గ్రామ కమిటీకి అధ్యక్ష కార్యదర్శులుగా దారా భీమరాజు, తంటపరెడ్డి వరహాల నాయుడు ఎన్నికయ్యారు, అలాగే కేవల్లాపురం గ్రామానికి మజ్జి బాబ్జి, బగుడు...