ePaper
Sunday, June 7, 2026
ePaper
Homeశివ సూర్య డైలీకొవ్వుత్తుల శాంతి ర్యాలీ చేసిన 'శ్రీ సాయి కృష్ణా వాకర్స్ క్లబ్'

కొవ్వుత్తుల శాంతి ర్యాలీ చేసిన ‘శ్రీ సాయి కృష్ణా వాకర్స్ క్లబ్’

📰 Generate e-Paper Clip

విజయనగరం : జయజయహే : శ్రీ సాయి కృష్ణా వాకర్స్ క్లబ్ అధ్యక్షులు తాడ్డి ఆదినారాయణ ఆధ్వర్యంలో ఈనెల 22వ తేదీ మంగళవారంనాడు జమ్మూ కాశ్మీర్ లో పహల్గాం వద్ద ఉగ్రవాదులు జరిపిన దనకాండ ను తీవ్రంగా ఖండిస్తూ, ఈఘాతుకానికి పాల్పడిన ముష్కరుల తూటాలకు బలైన అభంశుభం తెలియని యాత్రికుల ఆత్మశాంతికై ప్రార్థిస్తూ, ఈ దుశ్చర్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ శుక్రవారం సాయంత్రం స్థానిక అయ్యన్నపేట జంక్షన్ వద్ద కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ నిర్వహించి,అమరులైన యత్రికుల ఆత్మకు శాంతి కలగాలని క్లబ్ సభ్యలంతా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కోశాధికారి ఆర్.సి.హెచ్. అప్పలనాయుడు, సీనియర్ సభ్యులు జె.వి.ఎస్. ప్రసాద్, గొట్టిపల్లి సూర్యప్రకాశరావు, ఇందుకూరి అప్పలరాజు, తీడ రమణ,కొడుకుల రమేష్, సంబాన శ్రీరాం తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!