ePaper
Sunday, June 7, 2026
ePaper
Homeశివ సూర్య డైలీకార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్ను...

కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్ను…

📰 Generate e-Paper Clip

అన్ని సర్పంచ్ , ఎంపీటీసీ , జడ్పిటిసిలు మనమే గెలుపొందాలి

మీ.. అభిమానం ముందు.. వెన్నుపోటు దార్ల కుట్రలు పారలేదు

పుట్టి పెరిగిన మక్కువ అంటే ఎంతో అభిమానం

మక్కువ అభివృద్ధికి సర్పంచి అడ్డంకి

గిరిజన , స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి

మక్కువ, జయజయహే :- రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సాలూరు నియోజకవర్గం పరిధిలో గల మక్కువ మండలంలో గల 21 గ్రామపంచాయతీలతో పాటు అన్ని ఎంపీటీసీలు , జడ్పిటిసితో సహా నూటికి నూరు శాతం గెలుపొందే దిశగా నాయకులు కార్యకర్తలు అడుగులు వేయాలని రాష్ట్ర గిరిజన , స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి టిడిపి నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. శనివారం నాడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుళ్ల వేణుగోపాలనాయుడు అధ్యక్షతన స్థానిక సాయి భగవాన్ కళ్యాణ మండపంలో పార్టీ నాయకులు , కార్యకర్తలతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… మండలంలో గల అన్ని గ్రామ పంచాయతీల సర్పంచులతో పాటు ఎంపీటీసీలు , జడ్పిటిసితో సహా అన్ని పదవులు నూటికి నూరు శాతం తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆమె పిలుపునిచ్చారు. తనను ఎంతో ఆదరించి , అభిమానించి గెలిపించుకున్న మక్కువ మండల ప్రజల రుణం తీర్చుకుంటారని ఆమె ఈ సందర్భంగా తెలిపారు. తాను పుట్టి పెరిగిన మక్కువ అంటే తమకు ఎంతో అభిమానం అని ఆమె తెలిపారు. మక్కువ అభివృద్ధికి స్థానిక సర్పంచ్ అడ్డుపడుతున్నారు. గ్రామ అభివృద్ధికి అడ్డుపడుతున్న సర్పంచ్ ని ఓట్లు వేసి గెలిపించిన మీరే నిలదీయాలని ఆమె ఈ సందర్భంగా సమావేశానికి హాజరైన మక్కువ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. వెన్నుపోటు దారులు ఎన్ని కుట్రలు పన్నినా, మీ అభిమానం ముందు వారు కుట్రలు ఏమీ చేయలేకపోయాని , కుట్ర దారులను ఉద్దేశించి ఆమె పరోక్షంగా విమర్శించారు. మూడు కోట్ల రూపాయలతో మక్కువ మెయిన్ రోడ్డు పనులు త్వరలో చేపట్టబోతున్నట్టు ఈ సందర్భంగా ఆమె వెల్లడించారు. ప్రజా సమస్యలు పరిష్కరించేందుకే ప్రజా దర్బారు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన అన్నారు. గ్రామస్థాయిలో సమస్యలు పరిష్కరించుకునేందుకు గ్రామ కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న కార్యకర్తలను నాయకులను ఎప్పటికీ మరువనని ఆమె సందర్భంగా హామీ ఇచ్చారు. పార్టీ కోసం , తన గెలుపు కోసం పాటుపడిన కార్యకర్తలను ముందుంది నడిపిస్తానని ఆమె ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. అనంతరం 21 గ్రామపంచాయతీలకు సంబంధించి గ్రామ కమిటీలను ఆమె స్వయంగా ఎంపిక చేశారు. ఈ సమీక్ష సమావేశానికి మండలంలో గల 21 గ్రామ పంచాయతీలు నుండి తెలుగుదేశం పార్టీ నాయకులు , కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!