రావికమతం : జయజయహే : ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపుమేరకు శనివారం మాడుగుల ప్రెస్ క్లబ్ పరిధిలో గల రావికమతంలో స్థానిక విలేకరులు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సత్యనారాయణ ఆధ్వర్యంలో ఉగ్రదాడిపై నిరసన ప్రదర్శన నిర్వహించారు. స్థానిక నాయకులు తో పాటు పాత్రికేయులు కూడా ఈ కార్యక్రమంలో ప్ల కార్డులు పట్టుకొని ఉగ్రదాడినీ నిరసిస్తూ, కేంద్ర ప్రభుత్వం ఇలాంటి వారిపై కఠిన చర్యలు చేపట్టాలని,ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. అనంతరం స్థానిక ఎస్ఐకు వినతిపత్రం అందజేశారు.
మాడుగుల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఉగ్రదాడిపై నిరసన
0
48
RELATED ARTICLES

