ePaper
Sunday, June 7, 2026
ePaper
Homeశివ సూర్య డైలీఅగనంపూడి ప్రత్యేక రెవెన్యూ మండలం గా ఏర్పాటు చేయాలి - అగనంపూడి టిడిపి నాయకులు వినతి

అగనంపూడి ప్రత్యేక రెవెన్యూ మండలం గా ఏర్పాటు చేయాలి – అగనంపూడి టిడిపి నాయకులు వినతి

📰 Generate e-Paper Clip

అగనంపుడి : జయజయహే : డి ఆర్ సి సమావేశానికి విశాఖ జిల్లా ఇన్చార్జి మినిస్టర్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి కలెక్టర్ ఆఫీసు వచ్చిన సందర్భంగా టిడిపి రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సమక్షంలో ఏ డి సి చైర్మన్ బలిరెడ్డి సత్యనారాయణ అగనంపూడి పరిసర గ్రామాలను కలుపుకొని అగనంపూడి ప్రత్యేక రెవిన్యూ మండలం ఏర్పాటు చేయాలని, అగనంపూడి ఎర్రదిబ్బల వద్ద సర్వేనెంబర్ 56 లో గురుకుల పాఠశాలకి వైయస్సార్సీపి పాలనల్లో కేటాయించిన 16 ఎకరాల స్థలాన్ని రద్దు చేయాలని, టాటా హోమి బాబా క్యాన్సర్ ఆస్పత్రిలో స్థానిక యువతి, యువకులకు ఉపాధి కల్పించాలని, విశాఖ సిటీ నుండి లంకెలపాలెం వరకు మెట్రో ట్రైన్ ని పొడిగించాలని దీనివల్ల సిటీ నుండి వచ్చే ఫార్మా కంపెనీల ఉద్యోగులకు టాటా క్యాన్సర్ ఆసుపత్రికి ఇతర రాష్ట్రాలా నుండి వచ్చే పేషెంట్స్ కి సౌలాభ్యంగా ఉంటుందని , జీవీఎంసీ 79 ,85, 86 ,87 ,88 వార్డులకు అనుసంధానంగా అగనంపూడి లో పశువైద్య కేంద్రము ఉన్నదని అది శిథిలావస్థలో ఉన్నది కావున పశు వైద్య కేంద్రానికి పక్కా బిల్డింగు నిర్మించాలని, తలారివానిపాలెం రైల్వే బ్రిడ్జి అండర్ గ్రౌండ్ రోడ్డు వెయ్యాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వినతపత్రం స్వీకరించిన డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి సానుకూలంగా స్పందించి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 85 వార్డు ఇన్చార్జ్ కార్పొరేటర్ ఇల్లపు ప్రసాదు, 85 వార్డు టిడిపి ప్రెసిడెంట్ కర్రీ దశంద్ర, విశాఖ పార్లమెంటరీ టిడిపి అధికార ప్రతినిధి కసిపల్లి శ్రీనివాసరావు, సీనియర్ టిడిపి నాయకులు కొర్రయి జగదీష్ తదితరులు పాల్గొన్నారు,

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!