Saturday, April 11, 2026
Homeశివ సూర్య డైలీచంద్రబాబు గొప్ప రాజకీయ నాయకుడు –చిరంజీవి

చంద్రబాబు గొప్ప రాజకీయ నాయకుడు –చిరంజీవి

చంద్రబాబు పై ముఖ్యమంత్రి చంద్రబాబు పైన చిరంజీవి ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు ధీరోదాత్తుడ ని అలిపిరి దాడి ఘటనలో పడిలేచిన ఆయనలో ఎంతో మానసిక స్థైర్యం చూశానని కొనియాడారు. మంత్రి నారాయణ కుమార్తె శరణి రచించిన ‘మైండ్‌ సెట్‌ షిప్ట్‌’ పుస్తకావిష్కరణ సభకు హాజరైన చిరంజీవి వ్యక్తిత్వ వికాసానికి సంబంధించి పలు అంశాలపై మాట్లాడారు. జీవితం ఏమవుతుందో అనే అభద్రతాభావంతో ఉండే కంటే నేను సాధించగలనని మైండ్‌ సెట్​తో ముందుకెళ్లాలని. తాను అక్కడే విజయం సాధించానని​చిరంజీవి పేర్కొన్నారు. అత్యున్నత స్థానానికి వెళ్లినా ప్రవర్తన సరిగా లేకుంటే గుర్తింపు ఉండదని చెప్పుకొచ్చారు. అలిపిరి సంఘటనతో చంద్రబాబు కిందపడి లేచారని… అంతటి పరిస్థితిలోనూ ఎక్కడా చెక్కు చెదరలేదని వ్యాఖ్యానించారు.

ఊహించని పరిస్థితులు..

చంద్రబాబు మానసిక స్థైర్యంతో ఉన్నారని.. అంతటి ధీరోదాత్తత ఆయనలో తాను చూశానని వివరించారు. ప్రతికూల పరిస్థితులు వచ్చినా వాటిని అధిగమించేలా మంచి రోజులు వస్తాయనే నమ్మకంతో ముందుకు వెళ్లాలి. అందుకు నిదర్శనమే చంద్రబాబు అని చిరంజీవి పేర్కొన్నారు. చంద్రబాబు తనకు ఎంతో ఇష్టమైన రాజకీయ రంగంలో రాణించాలనే తపించారని ప్రశంసించా రని విశ్లేషించారు. కాలేజీ రోజుల నుంచి నాయకత్వ లక్షణాలతో ఎదిగారన్నారు. రాష్ట్రానికి సేవ చేయాలనే దీక్షతో నడిచిన చంద్రబాబు… వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుని ఎదిగారని చిరంజీవి చెప్పుకొచ్చారు. ఆయన నాయకత్వంలో హైదరాబాద్‌ ఐటీ రంగంలో అభివృద్ధి చెందిం దన్నారు. జీవితం పూలపాన్పు కాదని… ప్రతిచోటా ఆటంకాలు వస్తుంటాయని వివరించారు. అయినా.. ప్రయాణంలో ఇలాంటి ఊహించని పరిస్థితులు ఎదురవుతుంటాయన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?