Saturday, April 11, 2026
Homeశివ సూర్య డైలీపాకిస్తాన్ వాసులను వెనక్కు పంపండి రాష్ట్రాలకు అమిత్ షా కీలక ఆదేశాలు.

పాకిస్తాన్ వాసులను వెనక్కు పంపండి రాష్ట్రాలకు అమిత్ షా కీలక ఆదేశాలు.

జయజయహే : కాశ్మీర్ లోని అనంత్ నాగ్ జిల్లాలో ఉన్న పహల్గాంలో 26 మంది భారతీయ పౌరులపై తీవ్రవాదులు కాల్పులు జరిపి పొట్టనపెట్టుకున్న ఘటన దేశవ్యాప్తంగా అలజడి రేపుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా పాకిస్తాన్ తో అన్ని బంధాల్ని పూర్తిగా తెంచేసుకోవడంతో పాటు ఇరుదేశాల సరిహద్దులు మూసేయడం, మన దేశంలో ఉన్న పాకిస్తాన్ పౌరుల్ని బహిష్కరించడం వంటి చర్యలున్నాయి. ఇదే క్రమంలో హోంమంత్రి రాష్ట్రాలకు కీలక ఆదేశాలు ఇచ్చారు. పహల్గాం దాడి నేపథ్యంలో పాకిస్తాన్ పౌరుల్ని దేశం నుంచి బహిష్కరించాలని కేంద్ర కేబినెట్ వ్యవహారాల భద్రతా కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేసేందుకు కేంద్రం సిద్దమైంది. ఇందులో భాగంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు హోంమంత్రి అమిత్ షా ఇవాళ కీలక ఆదేశాలు ఇచ్చారు. తమ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్న పాకిస్తాన్ పౌరుల్ని గుర్తించి తక్షణం వెనక్కి పంపేయాలని ఈ ఆదేశాల్లో అమిత్ షా పేర్కొన్నారు. దీంతో పాక్ పౌరుల గుర్తింపు ప్రారంభమైంది. తమ అధికార పరిధిలో నివసిస్తున్న లేదా నివసిస్తున్న పాకిస్తాన్ జాతీయులందరినీ గుర్తించి వారిని బహిష్కరించాలని హోం మంత్రిత్వ శాఖ రాష్ట్రాలను కోరింది. హోంమంత్రి అమిత్ షా అన్ని ముఖ్యమంత్రులతో వ్యక్తిగతంగా మాట్లాడారని కూడా హోంశాఖ తెలిపింది. జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత ఐదు దశల దౌత్యపరమైన ప్రతిఘటనలో భాగంగా పాకిస్తాన్ జాతీయుల వీసాలను రద్దు చేసినట్లు కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. ఏప్రిల్ 27 నుండి అమలులోకి వచ్చేలా అన్ని వీసాలను రద్దు చేస్తామని తెలిపింది. వైద్య వీసాలు మాత్రం అదనంగా మరో 48 గంటలు మాత్రమే చెల్లుబాటు అవుతాయని కేంద్రం ఉత్తర్వుల్లో తెలిపింది. అయితే, హిందూ పాకిస్తాన్ జాతీయులకు దీర్ఘకాలిక వీసాలు చెల్లుబాటులో ఉంటాయని ప్రభుత్వం తెలిపింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?