పాకిస్తాన్ వాసులను వెనక్కు పంపండి రాష్ట్రాలకు అమిత్ షా కీలక ఆదేశాలు.
జయజయహే : కాశ్మీర్ లోని అనంత్ నాగ్ జిల్లాలో ఉన్న పహల్గాంలో 26 మంది భారతీయ పౌరులపై తీవ్రవాదులు కాల్పులు జరిపి పొట్టనపెట్టుకున్న ఘటన దేశవ్యాప్తంగా అలజడి రేపుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా పాకిస్తాన్ తో అన్ని బంధాల్ని పూర్తిగా తెంచేసుకోవడంతో పాటు ఇరుదేశాల సరిహద్దులు మూసేయడం, మన దేశంలో ఉన్న పాకిస్తాన్ పౌరుల్ని బహిష్కరించడం వంటి చర్యలున్నాయి. ఇదే క్రమంలో హోంమంత్రి రాష్ట్రాలకు కీలక ఆదేశాలు ఇచ్చారు. పహల్గాం దాడి నేపథ్యంలో పాకిస్తాన్ పౌరుల్ని...