Thursday, April 9, 2026
Homeశివ సూర్య డైలీప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలకు వైశ్యరాజు జ్యూయలర్స్ సహకారం వైశ్యరాజు జ్యూయలర్స్ , సిఎస్ఆర్...

ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలకు వైశ్యరాజు జ్యూయలర్స్ సహకారం వైశ్యరాజు జ్యూయలర్స్ , సిఎస్ఆర్ నిధులతో చేపట్టిన కళావేదికను, హ్యాండ్ వాష్ బేసిన్లను ప్రారంభించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ

విశాఖపట్నం జయ జయహే: విశాఖపట్నం జైల్ రోడ్ వద్ద గల విశాఖ ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాల కు వైశ్యరాజు జ్యూయలర్స్ సి ఎస్ ఆర్ నిధులతో నిర్మించబడిన కళావిధిగా మరియు హ్యాండ్ వాష్ బేసిన్ల ప్రారంభత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు . ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ , వైశ్యరాజు జ్యూయలర్స్ స్థాపకులు మరియు చైర్మన్ వైశ్యరాజు పాల్గుణ రాజు మరియు కుమారులైన వైశ్యరాజు గిరి , నరేష్ కుటుంబ సభ్యులు మరియు నేతలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ వైశ్యరాజు జ్యూయలర్స్ సేవా దృక్పథంతో ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం హర్షించ దగ్గ విషయం అని తెలిపారు. విద్యార్థులు భవిష్యత్తు దృష్ట్యా వారికి కావలసినటువంటి కనీస సదుపాయాలు తో పాటు కళాశాల మెరుగైన సౌకర్యాలు కల్పించుటకు తమ వంతు కృషి చేస్తామని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ హామీ ఇచ్చారు. దక్షిణ నియోజకవర్గంలో మరిన్ని పనులకు సిఎస్ఆర్ ద్వారా శ్రీకారంకు ప్రయత్నిస్తున్నానీ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ విజయ సబాద్యక్షత వహించగా, ఇంటర్ విద్యా జిల్లా అధికారి రాధ తో పాటు నిర్వహణ బాధ్యతలను డాక్టర్ మర్రివేముల శ్రీనివాస్ చేపట్టారు. అనంతరం ఇంటర్ ఫలితాలు అద్భుత ఉత్తమ మార్కులు సాధించిన టాపర్ లకు ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ చేతులమీదుగా సన్మానించారు.

            

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?