Saturday, April 11, 2026
Homeశివ సూర్య డైలీహాట్ బజార్స్ నిర్మాణాలు వేగంగా పూర్తి చేయండి- ఐటిడిఏ

హాట్ బజార్స్ నిర్మాణాలు వేగంగా పూర్తి చేయండి- ఐటిడిఏ

పాడేరు జయ జయహే : హాట్ బజార్స్ భవన నిర్మాణాలు వేగంగా పూర్తిచేయాలనీ ఐటిడిఏ సహాయ ప్రాజెక్టు అధికారి ఎం. వెంకటేశ్వరరావు, వి. ఎస్. ప్రభాకరరావులు అన్నారు. గురువారం ఐటిడిఏ సమావేశ మందిరంలో గిరిజన సహకార కార్పొరేషన్, వెలుగు మరియు గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాడేరు ఐటిడిఏ పరిదిలోని 44 హాట్ బజార్స్ మంజూరయ్యాయని చెప్పారు. సొంత భవనాలు లేని వి డి వి కే లు హాట్ బజార్స్ ని ఉపయోగించుకోవచ్చని పేర్కొన్నారు. ప్రతి మండలానికి ఒక మినీ సూపర్ బజార్ మంజూరు అయిందిని, దానికి కావాల్సిన ఐటమ్స్ జి సి సి ఇస్తుందని చెప్పారు. పి ఏం జన్ మన్ లోమంజురైన 8 విడివికే లు ఉపయోగిచుకుని అక్కడ ప్రతి రోజు తెరచి పనులు మొదలు పెట్టమని ఎపిఎం లకు ఆదేశించారు. ప్రతి ఎపిఎం లకు య౦త్రాలు కొనుగోలుకు మంజూరు అయిన దానిలో ఎంత ఖర్చుచేసారు ఇంకా ఎంత మిగిలిందని అరా తీసారు. య౦త్రాలు కొనుగోలు చేయలేని ఎపిఎం లకు త్వరగా య౦త్రాలు కొనమని ఆదేశించారు. డిఆర్ డిపో లలో ఉన్న పాత మరియు కొత్త స్టాక్ వివరాలు సంపర్పించలని జిసిసి అధికారులని ఆదేశించారు. మరమ్మత్తులో ఉన్న డి ఆర్ డి పో లు, గోడౌన్ లు, డి ఆర్ డి పో కం సూపర్ బజార్ లు జాబితా ను జిసిసి అధికారులను పంపవలసినిదిగా తెలిపారు. ఆర్ధిక సంవత్సరం 25-26 లక్ష్య౦లో ఎటువంటి మార్పులు ఉంటే కారణాలతో పాటు లక్ష్యాల వివరాలు పంపవలసిందిగా పేర్కొన్నారు. గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ లో ఉన్న హాట్ బజార్స్, గోకులాలు, మల్టీ పర్పస్ సెంటర్స్ మరియు రోడ్లు నిర్మాణాలు పనుల పురోగతిని తెలుసుకున్నారు. ఆలస్యంగా ఉన్న పనులు వేగవంతంగా పూర్తి చేయలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.ఈ సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ ఇ ఇ పాడేరు మరియు అరకువ్యాలి జి. డేవిడ్ రాజు, కె.వేణుగోపాల్, జిసిసి డి ఏం పాడేరు మరియు చింతపల్లి డి.సింహాచలం, పి దేవరాజు, డి ఆర్ డిఎ పిడి వి. మురళి, వెలుగు ఎపిఎం(ఫైనాన్స్) వి. ఎస్. ప్రసాద్ 11 మండలాల డిఇ లు, ఎఇ లు, వెలుగు ఎపిఎం లు, జిసిసి బిఏం లు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?