చోడవరం: జయజయహే : ప్రభుత్వం ఆదేశాల మేరకు అనకాపల్లి జిల్లా సమగ్ర శిక్ష వారి ఆధ్వర్యంలో గురువారం చోడవరం జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాలలో దివ్యాంగులకు ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఉచిత ఉపకరణాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ అనకాపల్లి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బత్తుల తాతయ్య బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా తాతయ్య బాబు మాట్లాడుతూ దివ్యాంగులు అంటే చాలా మందికి చిన్నచూపనీ,కానీ అన్నీ ఉన్నవారికంటే వారు ఏ మాత్రం తీసిపోకుండా తమ శక్తి సామర్థ్యాలను ప్రదర్శిస్తున్నారన్నారు. దివ్యాంగులు వారి నైపుణ్యాలను,శక్తి సామర్థ్యాలను వినియోగించుకుని పురోగతి వైపు అడుగులు వేయాలన్నారు.. ముఖ్యమంత్రీ నారా చంద్రబాబునాయుడు , ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దివ్యాంగుల మెరుగైన జీవనానికి ఎంతో కీలకం అయిన విద్యా, ఉపాధి, ఆరోగ్యం, సంరక్షణ, సాంకేతికరంగాల్లో వారికి అవకాశాలను అందించడంలో కూటమి ప్రభుత్వం అన్ని రకాలుగా అందుబాటులో ఉంటుందన్నారు.ఈ సందర్భంగా 23 బ్రైలీ కిట్లు, 09 బ్యాటరీ సైకిళ్ళు , 46 సీపీ కుర్చీలు, 9 ట్రై సైకిల్లు, ఎనిమిది రోలటర్లు 46, రొల్లటర్లు 8 , టి ఎల్ ఎం 13, మరో ట్రై సైకిల్స్ 12, వీల్ కుర్చీలు 73, హీరింగ్ పరికరాలు 69 కలిపి మొత్తంగా 262 మంది లబ్ధిదారులకు ఉపకరణాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు . ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర కార్పరేషన్ చైర్మన్ మళ్ళ సురేంద్ర, రాష్ట్ర వెలమ కార్పొరేషన్ చైర్మన్ పివిజి కుమార్, జిల్లా విద్యాశాఖ అధికారి డి అప్పారావు నాయుడు, ఎస్ఎస్సి ఏపీసి జయ ప్రకాష్, ఐ ఈ కోఆర్డినేటర్ శకుంతల, తహసిల్దార్ రామరావు, ఎంపీడీఓ ఆoజనేయులు, రాష్ట్ర గవర కార్పొరేషన్ డైరెక్టర్ బొడ్డెడ నాగ గంగాధర్, ఎంఈఓ సింహాచలం, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఐ.వెంకట రామిరెడ్డి, పాఠశాల కమిటీ చైర్మన్ సత్తిబాబు, ఎంపీటీసీ కొట్టాపు రూప జిల్లా, మండల అధికారులు ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అందరితో సమానంగా ఉంటున్న దివ్యాంగులు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల
RELATED ARTICLES

