అందరితో సమానంగా ఉంటున్న దివ్యాంగులు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల
చోడవరం: జయజయహే : ప్రభుత్వం ఆదేశాల మేరకు అనకాపల్లి జిల్లా సమగ్ర శిక్ష వారి ఆధ్వర్యంలో గురువారం చోడవరం జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాలలో దివ్యాంగులకు ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఉచిత ఉపకరణాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ అనకాపల్లి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బత్తుల తాతయ్య బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా తాతయ్య బాబు మాట్లాడుతూ దివ్యాంగులు అంటే చాలా మందికి చిన్నచూపనీ,కానీ అన్నీ ఉన్నవారికంటే వారు ఏ మాత్రం తీసిపోకుండా...