అగనంపుడి : జయజయహే : అగనంపూడి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 2024- 2025 సంవత్సరం లో ఇంటర్ ఫస్టియర్ ఇంటర్ సెకండియర్ లో ఎంపీసీ, సీఈసీ, హెచ్ ఇ సి వోకేషనల్ కోర్సులో ఈఈటి, ఎంపీహెచ్డబ్ల్యూ (ఫిమేల్) గ్రూపుల్లో ఫస్ట్ మార్కులు సాధించిన విద్యార్థులకు జీవీఎంసీ 79 వ వార్డు తెలుగు మహిళ అధ్యక్షురాలు గొల్లవిల్లి కనక భవాని ముందుకు వచ్చి విద్యార్థులను, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఫోటో పొందుపరిచిన షీల్డ్, పెన్ను, స్వీట్ తో సత్కరించితిరి. అదేవిధంగా విశాఖ జిల్లాలో ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్లో తృతీయ స్థానము సెకండ్ ఇయర్ లో ద్వితీయ స్థానం తీసుకువచ్చిన ప్రిన్సిపాల్ జి సుధాకరబాబు ని కూడా సన్మానించారు.అనంతరం ఆమె మాట్లాడుతూ గాజువాక నియోజకవర్గం లో మొదటిగా స్థాపించిన ప్రభుత్వ జూనియర్ కళాశాల అగనంపూడి దే దీని నిర్మాణం కొరకు పల్లా శ్రీనివాసరావు గారు ఎంతో శ్రమించారని, విద్యార్థులు క్రమశిక్షణ అంకితభావంతో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఏ డి సి చైర్మన్ బలిరెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ ఎంతోమంది కృషి ఫలితంగా అగనంపూడి కాలేజీ ఏర్పడిందని. ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఇటీవల ఇంటర్ బోర్డు కార్యదర్శి తో మాట్లాడి బైపిసి గ్రూపు కు పర్మినెంట్ అధ్యాపకులు ప్రిన్సిపాల్ నియమానకానికి మాట్లాడాలని, కాలేజీకి సోలార్ విద్యుత్తు ఏర్పాటుకు కృషి చేస్తున్నారని అన్నారు . ఉత్తమ ఫలితాలు రావడానికి కృషి చేసిన ప్రిన్సిపాల్, అధ్యాపకులకు అభినందించారు. కాలేజీ ప్రిన్సిపాల్ జి సుధాకర్ బాబు మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే గ్రామ పెద్దలు సహకారంతో కాలేజీ అభివృద్ధి చెందుతుందని ఏప్రిల్ 24 నుండి మే 31 వరకు కాలేజీ హాలిడేస్ అని ఏప్రిల్ 23న తారీఖున టెన్త్ రిజల్ట్స్ తర్వాత ఇంటర్లో విద్యార్థులు చేర్చాలని ఇచ్చట ఉచిత బోధన, ఉచిత బుక్స్, బ్యాగు, అక్షయ్ పాత్ర ద్వారా మిడ్ డే మీల్స్ తల్లికి వందనం స్కాలర్షిప్స్ ఇస్తారని అన్నారు. కాలేజీ లెక్చరర్స్ డి దివ్య, ఎం శ్రీదేవి, డి మంగ, ఎస్.కె సమీరా, జి ఆర్ ఎస్ రూతు, కె అవినాష్, సిహెచ్ ఆదినారాయణ, ఎల్ శివ నాగేశ్వరరావు, జె సూర్య ప్రదీప్, ఆర్ ద్రాక్షాయిని మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
అగనంపూడి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు అభినందన
0
53
RELATED ARTICLES

