ePaper
Saturday, June 6, 2026
ePaper
Homeవాతావరణంవేసవి వర్షాలు ఎంతో మేలుదాయకం

వేసవి వర్షాలు ఎంతో మేలుదాయకం

📰 Generate e-Paper Clip

మాడుగుల: జయజయహే : రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు పంటలకు లాభదాయకమే కానీ నష్టం కాదని మండల వ్యవసాయ అధికారి ఎం.వాసుదేవరావు చెప్పారు. బుధవారం సాయంత్రం ఆయన మాట్లాడుతూ రబీ సేజనలో వర్షాలు పడాల్సి ఉండగా వర్షపాతం లేదని అన్నారు. అయితే వేసవిలో ఎలాంటి జల్లులు కురిసిన ఏ పంటకైనా లాభదాయకమైనని చెప్పారు. ముఖ్యంగా మెట్ట పంటలకు మరింత లాభదాయకమని తెలిపారు. మాడుగుల మండలంలో 1300 ఎకరాలలో మెట్ట పంటలు వేసినట్టు చెప్పారు. ఈ వర్షాలు మూలంగా రైతులు ఆందోళన చెందవద్దని,అంతా మంచే జరుగుతుందని ఎఓ తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!