ePaper
Sunday, June 7, 2026
ePaper
Homeశివ సూర్య డైలీఅనారోగ్యానికి ఇబ్బంది కలిగించే సెల్ టవర్ కి పర్మిషన్ రద్దు చేయాలి ఏసిపి వినతి

అనారోగ్యానికి ఇబ్బంది కలిగించే సెల్ టవర్ కి పర్మిషన్ రద్దు చేయాలి ఏసిపి వినతి

📰 Generate e-Paper Clip

అగనంపూడి : జయజయహే :జీవీఎంసీ 79 వ వార్డు అగనంపూడి శాంతి నగర్ శ్రీ కళ్యాణి వెంకటేశ్వర ఆలయము దగ్గరలో రిలయన్స్ జియో సంస్థ భారీ ఎత్తైన సెల్ టవర్కు ఏర్పాటు చేయుటకు పర్మిషన్ ఇచ్చి ఉన్నారు. దానిని రద్దు చేయమని జీవీఎంసీ అసిస్టెంట్ సిటీ ప్లానర్ కే వెంకట్రావుని స్థానిక పురప్రజల తరుపున ఎడిసి చైర్మన్ బలిరెడ్డి సత్యనారాయణ కలిసి కేవలం ధనార్జన కొరకు సిటీలో ఉంటున్న ద్వారపూడి గణేష్ మాస్టారు జననివాసాల మధ్య ప్రజాభిప్రాయ సేకరణ తీసుకోకుండా ఈ స్థలమును సెల్ టవర్ నిమిత్తం లీజుకు ఇవ్వడం జరిగినది. రిలయన్స్ జియో సంస్థ వారు కూడా స్థానిక ప్రజల అభిప్రాయం తీసుకోకుండా ఆన్లైన్ ద్వారా పరిమిషన్ తీసుకొని రావడం జరిగింది. ఈ విషయం గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు దృష్టికి తీసుకుని వెళ్ళగా ఆయన ప్రజా వ్యతిరేకంగా సెల్ టవర్ పర్మిషన్ రద్దు చేయాలని జిల్లా కలెక్టర్ గారికి చెప్పడం జరిగినది ఆ విషయం లేక ఎసిపి గారికి అందజేయడం జరిగింది. కే వెంకట్రావు మాట్లాడుతూ సెల్ టవర్ పనులు జరిగితే వెంటనే మా దృష్టికి తీసుకురండి మేము స్థలం యజమాని సెల్ టవర్ సంస్థ వారిని పిలిపించి మాట్లాడుతావని ప్రజలకు ఇబ్బంది లేకుండా తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 79 వ వార్డు టిడిపి నాయకులు గల్లా రుద్ర కుమార్ స్థానిక నివాసకుల ప్రతినిధి శ్రీమతి చిత్త నాగమణి పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!