ePaper
Sunday, June 7, 2026
ePaper
Homeశివ సూర్య డైలీచంద్రబాబు జన్మదిన నిర్వహణకు "తెలుగు శక్తి" చురుకుగా ఏర్పాట్లు - రాష్ట్ర మంత్రులు ఆనం...

చంద్రబాబు జన్మదిన నిర్వహణకు “తెలుగు శక్తి” చురుకుగా ఏర్పాట్లు – రాష్ట్ర మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి,డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు చేతుల మీదుగా పోస్టర్ ఆవిష్కరణ – సింహాచలం భూముల ఆక్రమణల వివరించిన “తెలుగు శక్తి” బి.వి.రామ్

📰 Generate e-Paper Clip

విశాఖపట్నం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 75వ జన్మదినాన్ని ఘనంగా నిర్వహించేందుకు తెలుగు శక్తి చురుకుగా ముందుకు కదులుతోంది. ఈ నేపథ్యంలోనే బుధవారం గోశాల సమీపంలోని సింహాచలం సమావేశ మందిరంలో.. రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, విశాఖ జిల్లా ఇన్చార్జ్ మంత్రి డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు చేతుల మీదుగా.. చంద్రబాబు నాయుడు జన్మదిన పోస్టర్ ను తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ ఆవిష్కరింపజేశారు.

వైసిపి అక్రమార్కుల చేతుల్లో సింహాచలం భూములు

ఈ సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తో బి.వి.రామ్ మాట్లాడుతూ..వైసిపి అక్రమార్కుల చేతుల్లో సింహాచలం భూములు ఉన్నాయని ఫిర్యాదు చేశారు. పూసపాటి వంశీయులు వేలాది ఎకరాల భూమిని సింహాచలం దేవస్థానానికి అందజేశారన్నారు. అయితే వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత దేవస్థానం భూములు కబ్జాకు గురయన్నారు.

ఎన్టీఆర్ జయంతి ని అధికారికంగా నిర్వహించాలి

తెలుగు తేజం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా పని చేసిన దివంగత నందమూరి తారక రామారావు జయంతి ని ప్రభుత్వం అధికారిక కార్యక్రమం గా నిర్వహించాలన్నారు.అనంతరం దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పందిస్తూ.. అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు.ఈ కార్యక్రమంలో పీతల అప్పారావు, కే.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!