ePaper
Sunday, June 7, 2026
ePaper
Homeశివ సూర్య డైలీడా. బి.ఆర్ అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని వేడుకలను ఘనంగా నిర్వహించిన నగర పోలీసు కమీషనర్ డా.శంఖబ్రాత...

డా. బి.ఆర్ అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని వేడుకలను ఘనంగా నిర్వహించిన నగర పోలీసు కమీషనర్ డా.శంఖబ్రాత బాగ్చి, ఐ.పి.ఎస్.,

📰 Generate e-Paper Clip

విశాఖపట్నం : జయజయహే : విశాఖ నగర పోలీసు కమిషనరేట్ నందు నవభారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా. బాబాసాహెబ్ అంబేద్కర్ (బి.ఆర్ అంబేద్కర్) చిత్ర పటానికి సీపీ ఇతర ఉన్నతాధికారులు మరియు సిబ్బందితో కలిసి పూల మాలలు వేసి నివాళులు అర్పించినారు. ఈ సందర్భంగా సీపీ అంబేద్కర్ ని స్మరించుకుంటూ అంబేద్కర్ గొప్ప మేధావి, సంఘ సంస్కర్త, ఆర్థిక శాస్త్రవేత్త, రాజనీతిజ్ఞుడని కొనియాడారు. ఆయన అణగారిన బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎంతగానో పాటుపడ్డారని, దళితుల, గిరిజనులు, బహుజనుల హక్కుల కోసం పోరాడిన మహోన్నత వ్యక్తి అని, అంబేద్కర్ దేశ ప్రజలు స్వేచ్ఛాగా, పరస్పర గౌరవంతో కలిసిమెలసి జీవించాలనే దృఢ సంకల్పంతో భారతీయులు గర్వించే విధంగా భారత రాజ్యాంగాన్ని రచించి, బడుగు బలహీన వర్గాల రక్షణ కోసం రాజ్యాంగంలో అనేక ప్రతిపాదనలు రూపొందించారన్నారు. ఆయన స్ఫూర్తిని త్యాగనిరతిని, నేటి తరం యువత ఆదర్శంగా తీసుకుని దేశ ప్రగతికి పాటుపడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీ తో పాటూ ఏ.డి.సి.పి అడ్మిన్ , ఇతర అధికారులు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!