డా. బి.ఆర్ అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని వేడుకలను ఘనంగా నిర్వహించిన నగర పోలీసు కమీషనర్ డా.శంఖబ్రాత బాగ్చి, ఐ.పి.ఎస్.,
విశాఖపట్నం : జయజయహే : విశాఖ నగర పోలీసు కమిషనరేట్ నందు నవభారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా. బాబాసాహెబ్ అంబేద్కర్ (బి.ఆర్ అంబేద్కర్) చిత్ర పటానికి సీపీ ఇతర ఉన్నతాధికారులు మరియు సిబ్బందితో కలిసి పూల మాలలు వేసి నివాళులు అర్పించినారు. ఈ సందర్భంగా సీపీ అంబేద్కర్ ని స్మరించుకుంటూ అంబేద్కర్ గొప్ప మేధావి, సంఘ సంస్కర్త, ఆర్థిక శాస్త్రవేత్త, రాజనీతిజ్ఞుడని కొనియాడారు. ఆయన అణగారిన బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎంతగానో పాటుపడ్డారని, దళితుల, గిరిజనులు, బహుజనుల హక్కుల కోసం పోరాడిన...