Monday, April 6, 2026
Homeశివ సూర్య డైలీడా. బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా వివిధ ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్న సౌత్ ఎమ్మెల్యే...

డా. బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా వివిధ ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్న సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్

విశాఖపట్నం : జయజయహే : ఎల్.ఐ.సి బిల్డింగ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి గౌరవ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ గారితో కలిసి ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా అంబేద్కర్ ఆశయాలు తో పాటు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చేసిన సేవలు సమాజంలో చిరస్థాయిగా నిలిచిపోయాయని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు . కార్యక్రమంలో కూటమి శ్రేణులు, ప్రభుత్వ సిబ్బంది పాల్గొన్నారు. విశాఖ జనసేన పార్టీ నగర పార్టీ కార్యాలయంలో జరిగిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలో దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే ,జనసేన పార్టీ విశాఖపట్నం నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ అని అన్నారు. కార్యక్రమంలో వివిధ నియోజకవర్గాల ఇన్చార్జులు, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ లో జిల్లా నాయకులు, వార్డ్ శ్రేణులు పార్టీ నాయకులు ,కార్యకర్తలు పాల్గొన్నారు..ఏ.వి.ఎన్ కాలేజ్ అంబేద్కర్ సర్కిల్ వద్ద జై భీమ్ కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుక కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జై భీమ్ నినాదాలతో ఆ ప్రాంతం మారుమ్రోగింది. కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరం కలిసి నడుద్దామని అన్నారు . అనంతరం విద్యార్థులకు స్కూల్ బ్యాగ్ లను కమిటీ వారి ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. కార్యక్రమంలో కూటమి శ్రేణులు, నాయకులు పాల్గొన్నారు… దిగువ రెల్లి వీధి వద్ద అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అంబేద్కర్ జయంతి వేడుకలో స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పాల్గొని నివాళులర్పించారు. కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు ద్వారా ప్రజలకు లబ్ది కలుగుతుందని ఎమ్మెల్యే అన్నారు. కార్యక్రమంలో నిర్వాహకులు మధుగారు, మరియు స్థానిక పెద్దలు ,కూటమి శ్రీనులు, నాయకులు పాల్గొన్నారు.. 30 వార్డ్ పరిధిలో తాడివీధిలో అంబేద్కర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన జయంతి వేడుకలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో అసోసియేషన్ పెద్దలు, స్థానిక కూటమి వార్డ్ అధ్యక్షులు, కూటమి పెద్దలు పాల్గొన్నారు..అనంతరం… 35 వార్డ్ పరిధిలో మున్సిపల్ కమర్షియల్ కాంప్లెక్స్ మర్చంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జనతా బజార్ వద్ద మజ్జిగ పంపిణీ, అరటిపళ్ళు పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ చేతులమీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ దృష్టికి అసోసియేషన్ పెద్దలు పలు సమస్యలు విన్నవించారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ వారి సమస్యలపై సానుకాలంగా స్పందించి, త్వరలో ప్రణాళిక ప్రకారం జనతా బజార్ అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అసోసియేషన్ పెద్దలు, సభ్యులు, కూటమి శ్రేణులు పాల్గొన్నారు…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?