డా. బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా వివిధ ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్న సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్

విశాఖపట్నం : జయజయహే : ఎల్.ఐ.సి బిల్డింగ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి గౌరవ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ గారితో కలిసి ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా అంబేద్కర్ ఆశయాలు తో పాటు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చేసిన సేవలు సమాజంలో చిరస్థాయిగా నిలిచిపోయాయని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు . కార్యక్రమంలో కూటమి శ్రేణులు, ప్రభుత్వ సిబ్బంది పాల్గొన్నారు. విశాఖ జనసేన పార్టీ నగర పార్టీ కార్యాలయంలో జరిగిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్...