ePaper
Saturday, June 6, 2026
ePaper
Homeశివ సూర్య డైలీభారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి -నివాళులు అర్పించిన మన్యాల శ్రీనివాస్

భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి -నివాళులు అర్పించిన మన్యాల శ్రీనివాస్

📰 Generate e-Paper Clip

విశాఖపట్నం : జయజయహే : ప్రపంచ మేధావి,భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ తో పాటు 29 వ వార్డు మన్యాల శ్రీనివాస్ మరియు వారి టీం సభ్యులు అందరూ కూడా బిఆర్ అంబేద్కర్ కి నివాళులర్పించారు. ఈ సందర్బంగా మన్యాల శ్రీనివాస్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత, దేశంలో గమనాన్ని మార్చడం లో ఆయన పోషించిన పాత్రను, జాతికి అందించిన సేవలను కొనియాడారు.., అసమానతలు లేని ఆధునిక భారతదేశాన్ని ఆవిష్కరించేందుకు అన్ని వ్యవస్థల్లో సమాన హక్కుల కోసం తన జీవితకాలం పరితపించిన వారు అంబేద్కర్ మాత్రమే అని చెప్పారు… అణగారిన వర్గాల కోసం గొంతెత్తిన స్వరం,అంటరానితనం పై భగ్గున మండిన భాస్వరం మన రాజ్యాంగ నిర్మాత అని ఆయన చేసిన మార్గదర్శకాలు భవిష్యత్తు భవిష్యత్ తరాలకు ఆదర్శమని అంతటి గొప్ప మహానుభావుడుకి నివాళులు అర్పించడం ఆనందదాయకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో 29వ వార్డ్ జనసేన నాయకులు పెందుర్తి గిరిబాబు, సారిపిల్లి పండు, నడుపూరి రాజు, అంగటి సురేష్, చెన్న ప్రవీణ్, పెసల శివ, జంపా గురునాద్, Y.మురళి, టైలర్ సతీష్ , P.శ్రీను, పవన్, శివ కుమార్, చిన్నా, వంశీ కృష్ణ, దుర్గ, వరప్రసాద్, రమణ, మహేష్, శంకర్, రమేష్, రాజేష్, పప్పు, గౌరీ శంకర్, అప్పారావు, హరి, శివ ప్రసాద్, చలపతి, బుజ్జి, అప్పారావు మరియు మహిళలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!