Saturday, April 11, 2026
Homeశివ సూర్య డైలీమే డే ఉత్సవాలు ప్రభుత్వంమే నిర్వహించాలని రాష్ట్ర టిఎన్టియుసి కమిటీ తీర్మానం - విల్లా రామ్మోహన్...

మే డే ఉత్సవాలు ప్రభుత్వంమే నిర్వహించాలని రాష్ట్ర టిఎన్టియుసి కమిటీ తీర్మానం – విల్లా రామ్మోహన్ కుమార్

అగనంపూడి :జయజయహే: అగనంపూడి సి డబ్ల్యూ సి లో టిఎన్టియుసి సమావేశం లో రాష్ట్ర టిఎన్టియుసి ఉపాధ్యక్షులు విల్లా రామ్మోహన్ కుమార్ మాట్లాడుతూ నిన్న విజయవాడలో రాష్ట్ర టిఎన్టియుసి సమావేశంలో గత ఐదేళ్లు వైఎస్ఆర్సిపి పాలనలో కార్మికులను విస్మరించి మేడే ఉత్సవాలు నిర్వహించలేదు .కావున రాష్ట్ర ప్రభుత్వమే మేడే ఉత్సవాలు నిర్వహించే కార్మికులకు విశిష్ట సేవలందించిన కార్మిక నాయకుల్ని గుర్తించి శ్రమశక్తి అవార్డులు ఇవ్వాలని సమావేశం తీర్మానించి రాష్ట్ర టిఎన్టియుసి అధ్యక్షులు ఆధ్వర్యంలో గొట్టుముక్కల రఘురామరాజు ఆధ్వర్యంలో లేబర్ కమిషనర్ని కలిసి వినతి పత్రము అందజేయడం జరిగినది. ఆయన సానుకూలంగా స్పందించి కార్మిక శాఖ మంత్రిత్వ సంప్రదించి తగు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు అని అన్నారు. విశాఖ పార్లమెంటరీ టిఎన్టియుసి ప్రధాన కార్యదర్శి కొర్రయి నాగార్జున మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పరిశ్రమంలో టిఎన్టిసి బలవపాతం చేసి తద్వారా టిడిపికి వెన్నుముక్కగా నిలబడాలని స్టీల్ ప్లాంట్ కార్మికుల్ని విఆర్ఓ ద్వారా కాంట్రాక్టు కార్మికుల్ని తొలగింపు పై యాజమాన్యం తీరు మార్చుకోవాలని రాష్ట్ర కమిటీ దీనిపై టిడిపి పై ఒత్తిడి చేస్తుందని అన్నారు.

విశాఖ పార్లమెంటరీ టిఎన్టియుసి అధికార ప్రతినిధి బలిరెడ్డి సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో 85 వార్డు టిడిపి ఇంచార్జ్ గంతకోరు అప్పారావు టి ఎన్ టి యు సి నాయకులు డొక్కా రమేష్ శీరంశెట్టి బాబ్జి ఆటో కార్మిక సంఘం నుండి సింగిడి సింహాచలం ఈగల తాతారావు టైలర్ కార్మికుల నుండి తలారి శ్రీనివాసరావు మరియు వివిధ సంఘాల నుండి టిఎన్టియుసి నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?