Friday, April 10, 2026
Homeశివ సూర్య డైలీపాఠశాలలను సందర్శించిన ఎమ్మెల్యే గంటా

పాఠశాలలను సందర్శించిన ఎమ్మెల్యే గంటా

ఎండాడ, జయజయహే: ఎండాడ, గొల్లలపాలెం పాఠశాలలను భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గురువారం ఆకస్మికంగా సందర్శించారు. రెండు పాఠశాలల్లోనూ ప్రాథమిక పాఠశాల అడ్మిషన్ల తీసుకోవడం వల్ల విద్యార్థుల తల్లిదండ్రుల్లో అయోమయం నెలకొంటుందని స్థానిక నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లగా, అధికారులతో చర్చించి పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. గొల్లలపాలెం పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించారు. గొల్లలపాలెం పాఠశాల భవనం ముందు శిధిలావస్థలో ఉన్న తుఫాను షెల్టర్ ను తొలగించాలని అధికారులను ఆదేశించారు.రైతు బజార్ స్థల పరిశీలన ఎండాడలో రైతు బజార్ ఏర్పాటుకు అనువుగా ఉన్న ప్రాంతాలను ఎమ్మెల్యే గంటా పరిశీలించారు. సుభాష్ నగర్ లోని ఖాళీ స్థలంతో పాటు పార్కు స్థలాన్ని కూడా చూశారు. ఈ ప్రాంత ప్రజలు ఎప్పటినుంచో కోరుతున్న రైతుబజార్ ఏర్పాటుకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రయత్నాలు వేగవంతం చేశారు. స్థలం ఎంపిక పూర్తయిన తర్వాత సాధ్యమైనంత త్వరగా రైతుబజార్ అందుబాటులోకి తీసుకు వస్తామని గంటా శ్రీనివాసరావు ఈ సందర్భంగా తెలిపారు.ఎండాడ రాజీవ్ నగర్ లో అస్తవ్యస్తంగా ఉన్న పారిశుద్ధ్యం నిర్వహణ పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. డ్రెయిన్లలో నిలిచిపోయిన మురుగు గురించి ఫిర్యాదు చేసినా జీవీఎంసీ పట్టించుకోవడం లేదని స్థానిక మహిళలు చెప్పగా సంబంధిత సిబ్బందిపై ఎమ్మెల్యే మండిపడ్డారు. మురుగు ఎలా నిలిచిపోయిందో చూడకుండా కళ్లు మూసుకుపోయాయా అని తీవ్ర స్వరంతో శానిటరీ ఉద్యోగిని మందలించారు. అనంతరం తాగునీటి సరఫరా సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. నీటి ఎద్దడి మరీ ఎక్కువగా ఉంటే ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తామన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు చెట్టిపల్లి గోపీ, శాఖారి శ్రీనివాస్, సారిపల్లి శ్రీను, లొడగల రామ్మోహన్, మంగాదేవి, జీవీఎంసీ అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?