ePaper
Saturday, June 6, 2026
ePaper
Homeశివ సూర్య డైలీసామాజికసేవకు ప్రతిరూపం కోరాడ నాగభూషణం: టిడిపి రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు

సామాజికసేవకు ప్రతిరూపం కోరాడ నాగభూషణం: టిడిపి రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు

📰 Generate e-Paper Clip

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కోరాడ నాగభూషణం మరణం పార్టీకి, భీమిలి నియోజకవర్గానికి తీరని లోటని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు అన్నారు. గురువారం ఉదయం అకాలరమరణం పొందిన నాగభూషణం పార్దివదేహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించిన అనంతరం గంటా నూకరాజు మీడియాతో మాట్లాడారు. సామాజిక సేవలో, సంఘ సేవలో ఎప్పుడూ ముందుండేవారని అన్నారు. ఎవరైనా అన్నార్తులు కష్టంతో వారి తలుపుతడితే సాయం చేసి పంపే చేతులను భీమిలి నియోజకవర్గం కోల్పోయిందని అన్నారు. తెలుగుదేశం పార్టీలో క్రియాశీలంగా ఉండి పార్టీ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని అన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా మచ్చలేని పాలనకు శ్రీకారం చుట్టారని అన్నారు. ఎంతో హుందాగా రాజకీయాలు చేశారని, అందరినీ కలుపుకుంటూ చిరునవ్వుతో పలకరించే మా నాగభూషణం ఇకలేరని తెలుసుకొని ఆప్తులు, అన్నార్తులు తల్లడిల్లారని అన్నారు. నాగభూషణం భౌతికంగా మనమధ్య లేకపోయినా ఆయన చేసిన సేవలు రూపంలో అనుక్షణం మనమద్యే ఉంటారని అన్నారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు దేవుడు మనోదైర్యం ఇవ్వాలని గంటా నూకరాజు కోరారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!