సామాజికసేవకు ప్రతిరూపం కోరాడ నాగభూషణం: టిడిపి రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కోరాడ నాగభూషణం మరణం పార్టీకి, భీమిలి నియోజకవర్గానికి తీరని లోటని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు అన్నారు. గురువారం ఉదయం అకాలరమరణం పొందిన నాగభూషణం పార్దివదేహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించిన అనంతరం గంటా నూకరాజు మీడియాతో మాట్లాడారు. సామాజిక సేవలో, సంఘ సేవలో ఎప్పుడూ ముందుండేవారని అన్నారు. ఎవరైనా అన్నార్తులు కష్టంతో వారి తలుపుతడితే సాయం చేసి పంపే చేతులను భీమిలి నియోజకవర్గం కోల్పోయిందని అన్నారు. తెలుగుదేశం...