జయజయహే : గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడింది. మే 19 న జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎన్నిక జరపాలని నిర్ణయించింది. 19 వ తేదీ ఉదయం 11 గంటలకు జీవీఎంసీ కౌన్సిల్ ప్రత్యేక సమావేశం జరపాలని నిర్ణయించారు. డిప్యూటీ మేయర్ ఎన్నిక కు ఇన్చార్జ్ గా జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. టీడీపీ నుంచి డిప్యూటీ మేయర్ ఎవరనేది 19న స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
